ఘనంగా జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవం

నవ తెలంగాణ-గోవిందరావుపేట
జాతీయ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య జండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు శాసనసభ్యులు సీతక్క హాజరై పొగాకు ఉత్పత్తుల నియంత్రణ మరియు ప్రాణ రక్షణ గురించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్యులు డాక్టర్ సుకుమార్, డాక్టర్ చెంద్రకాంత్, డాక్టర్ మధు, సిహెచ్ఓ లు సదానందం, సురేష్, సంపత్ రావు, హెచ్ ఈ తిరుపతయ్య, సంపత్ మరియు హెల్త్ అసిస్టెనట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love