సామాజిక సేవలు, క్రీడలు, వైద్యం…
జర్నలిజంలో నైపుణ్యానికి గుర్తింపుగా అవార్డులు
భీష్మరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజకుమార్ రెడ్డికి నంది అవార్డు
ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు అందుకున్న పరిపూర్ణం
సామాజిక దక్పథంతో రాసే కథనాలు ఆయన సొంతం
నవతెలంగాణ- మహబూబ్ నగర్
ప్రాంతీయ ప్రతినిధి
ఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని ప్రగతి పౌండేషన్ నిర్వాహకులు వెల్లడించారు. ప్రజా సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు, సామాజిక సేవలు అందిస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాక్టర్లు, మేధావులు వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ అవార్డుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భీష్మ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కే రాజ్ కుమార్ రెడ్డికి బంగారు నంది అవార్డు వరించింది. నాలుగైదేండ్లుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసిన అనేక సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డు లభించింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ప్రగతి ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రధానోత్సవంలో ఆయనకు ఈ అవార్డు అందజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం రాజ్ కుమార్ రెడ్డి సేవలకు నిదర్శనం. యువతకు జాబ్ మేళా, విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేదలకు ఉచిత వైద్యం, దేవాలయాల పున:రుద్ధరణ, కొత్త దేవాలయాల నిర్మాణం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. నారాయణపేట అభివృద్ధి కోసం స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి రాజకుమార్ రెడ్డి కృషి చేశారు.
అదే విధంగా బాల్యం నుంచి అనేక సమస్యలతో సతమతమవుతూ పేదల కష్ట సుఖాలను స్వయంగా అధ్యయనం చేసిన ఎరుకలి పరిపూర్ణం నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలో జన్మించారు. ఆయన చెంచుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని, వారి జీవనశైలి పై స్వయంగా ఆదివాసుల పెంటలు, గూడాలు సందర్శించి రాసిన కథనాలు ఎన్నో ఉన్నాయి. జోగిని వ్యవస్థ రూపుమాపేందుకు నిర్వహించిన పోరాటాలలో భాగస్వామ్యం అవుతూ ఎన్నో కథనాలు భావ్య ప్రపంచానికి అందించారు. మూఢనమ్మకాలపై ఆయన ఎన్నో కథనాలు రాయడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో 2012లో డొక్కా మాణిక్య వరప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్నారు. 2013లో ప్రకాశం జిల్లా ఎల్లటూరు, 2015లో మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్, 2016లో నాగర్ కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు మాజీ మంత్రి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.



