ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌పై సిబ్బందికి అవగాహన

నవతెలంగాణ-బోనకల్‌
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ పోలింగ్‌పై క్షేత్రస్థాయిలో గల సిబ్బందికి స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో ఎన్నికల సహాయం రిటర్నింగ్‌ అధికారి, ఖమ్మం ఆర్డీవో గుంటుపల్లి గణేష్‌ శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. బూతు లెవల్‌ అధికారులచే ఓటర్ల స్లిప్స్‌ పంపిణీ, ఓటర్ల మొబైల్‌ నందు సి- విజిల్‌ డౌన్లోడ్‌, పోలింగ్‌ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పన పనులు, పురుషులు స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్స్‌ పై అవగాహన నిర్వహించారు. రన్నింగ్‌ వాటర్‌, మహిళలకు ప్రత్యేకంగా బాత్రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల గదులలో లైట్లు, ఫ్యాన్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 1000 ఓట్ల కంటే ఎక్కువగా ఓటర్లు గల పోలింగ్‌ కేంద్రంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ డోర్స్‌ డబుల్‌ డోర్స్‌ ఏర్పాటు, పురోగతి పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులకు వాల్‌ పోస్టర్లు అందజేశారు. అందులో పోలింగ్‌ కేంద్రం వివరములు, బిఎల్‌ఓ, సూపర్వైజర్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌, సహాయ రిటర్నింగ్‌, రిటర్నింగ్‌ అధికారి పేరు మొబైల్‌ నెంబరు తదితర వివరాలు ఉంటాయి అని తెలిపారు. ఈ వాల్‌ పోస్టర్లను పోలింగ్‌ ముందు గోడకు, పోలింగ్‌ కేంద్రం నెంబర్‌, బిఎల్‌ఓ పేరు తదితర వివరాలు రాసి ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో మండల తహసిల్దార్‌ అనిశెట్టి పున్నం చందర్‌, ఎంపీడీవో లకావత్‌ రాజు, ఎన్‌ఎస్పిడిఈ పబ్బతి శ్రీనివాస్‌ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love