కవులు, రచయితలు, రచనలు: బిరుదులు-పురస్కారాలు:ఇతివృత్తాలు, సందర్భ నేపథ్యాలు – పాత్రలు, విశేషాంశాలు

నానాపురం నర్సింహులు 9030057994 1. ఈ క్రింది వానిలో పురాణ ప్రక్రియకు చెందినది?
ఎ.రామాయణ బి.మహాభారతం
సి.భాగవతం డి.హరివంశం
2. పోతన భక్తితత్వం ఇలాంటిది…?
ఎ.సరసభక్తి బి.సనాతనభక్తి
సి.దైవభక్తి డి.మధురభక్తి
3. ‘గజేంద్ర మోక్షం’ ఘట్టం గల స్కంధం
ఎ.అష్టమస్కంధం బి.నవమస్కంధం
సి. దశమస్కంధం డి.ఏకాదశ స్కంధం
4. పోతన రచించిన శతకం?
ఎ. శ్రీహరి శతకం బి. కృష్ణ శతకం
సి.నారాయణ శతకం డి. వీరభద్ర శతకం
5. సర్గం, ప్రతి సర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం అనేవి?
ఎ.ఇతిహాస లక్షణాలు
బి. పురాణ లక్షణాలు
సి.పురాణ, ఇతిహాస లక్షణాలు
డి.మనువు రూపాలు
6. పోతన రచన కానిది?
ఎ.ఇంద్ర విజయం బి. వీరభద్ర విజయం
సి. నారాయణ శతకం డి. భోగినీ దండకం
7. జతపరుచుము
1. ప్రహ్లాద చరిత్ర ఎ.సప్తమ స్కంధం
2. రుక్మిణీ కళ్యాణం బి. అష్టమ స్కంధం
3. రంతి దేవుని చరిత్ర సి. నవమ స్కంధం
4. వామన చరిత డి. దశమ స్కంధం 1 2 3 4
ఎ) డి ఎ సి డి
బి) ఎ డి బి సి
సి) సి బి డి ఎ
డి) ఎ డి సి బి
8. కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ పోతన గూర్చి ఇలా వ్యాఖ్యానించాడు?
ఎ. సర్వమార్గేచ్ఛా విధాతృండు బి. తెలుగు పుణ్యంపుపేటి
సి. విపుల చాటు కీర్తి డి. సారస్వత ధురిణ
9. బలి చక్రవర్తి యాగం చేసిన ప్రదేశం?
ఎ. గంగానది తీరం బి. తపతీనదీతీరం
సి. నర్మదానదీ తీరం డి. గోదావరి నదీ తీరం
10. బొడగన జననట్టి పొడవు పొడవున గురుచై – పద్యపాదం
ఎ. కందం బి. ఆటవెలది
సి. తేటగీతి డి. చంపకమాల
11. ‘జీవచ్ఛవం’ను విడదీయగా…
ఎ. జీవ+చ్ఛవం బి. జీవచ్ఛ+ఆవం
సి. జీవత్‌+శవం డి. జీవ+శవం
12. ఆ, ఈ, ఏ….లు
ఎ. త్రికాలు, తత్సమాలు బి. త్రికాలు, నామవాచకాలు
బి. త్రికాలు, సన్వనామాలు డి. త్రికాలు, తద్భవాలు
13. తెలుగు సంధిని గుర్తించండి?
ఎ. ఛత్వసంధి బి. త్రికసంధి
సి. యణాదేశసంధి డి. అనునాసిక సంధి
14. ‘వికారాబాద్‌ జిల్లాలో ఎందరో కవులు, వారందరికి వందనాలు’ అనే వాక్యం
ఎ. సామాన్య వాక్యం బి. సాధారణ వాక్యం
సి. సంయుక్త వాక్యం డి. సంశ్లిష్ట వాక్యం
15. ‘పసందు’ అనేది ఏ భాష నుండి తెలుగులోకి వచ్చి చేరింది?
ఎ. తమిళం బి. డచ్చీ
సి. ఫ్రెంచ్‌ డి. ఉర్దూ
16. కాళోజి నారాయణరావు గారికి భాషపై అభిప్రాయం ఇలాంటిది..?
ఎ.పలుకు బడుల భాషగావాలె బి. తెలంగాణ భాష తేరక్యాంధ్రం
సి. బడి పలుకుల భాషగావాలె డి. తెలంగాణ భాష గ్రాంథిక భాష
17. డా|| సామల సదాశివ ఈ ప్రాంతం వారు?
ఎ. నిజామాబాద్‌ బి. ఆదిలాబాద్‌
సి. కరీంనగర్‌ డి. వరంగల్‌
18. ఈ క్రింది వానిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన?
ఎ. మలయమారుతాలు బి. అమ్జద్‌ రుబాయిలు
సి. స్వరలయలు డి. సంగీత శిఖరాలు
19. ‘ఆంధ్ర బిల్హణ’ బిరుదాంకితులు…?
ఎ. కప్పగంతుల నారాయణ శాస్త్రి బి. కప్పగంతుల లక్షణ శాస్త్రి
సి. డా|| సామల సదాశివ డి. పానుగంటి లక్ష్మీనరసింహా
20. వ్యాస లక్షణం
ఎ. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా ఉండాలి.
బి. నిర్భరత, సంక్షిప్తత, సమగ్రత, పాత్రబాహుళ్యం
సి. వివరణాత్మకంగా, శిల్ప నైపుణ్యంతో, సులభంగా ఉండడం
డి. సంక్షిప్తత, ఏకగ్రత, సమగ్రత

21. ‘శ్రీమంతురాలు’ అనే సమాసపదంలో తత్సమం..?
ఎ. ‘శ్రీ’ మాత్రమే బి. శ్రీమంత
సి. ఆలు డి. తత్సమపదం లేదు
22. దాశరధి కృష్ణమాచార్య రాసిన ‘అమృతాభిషేకం’…?
ఎ. నాటకం బి. నవల
సి. కవితాసంపుటి డి. స్వీయచరిత్ర
23. దాశరథిచే 1952లో ఏర్పటు చేయబడిన తెలంగాణ రచయితల సంఘంలో కార్యవర్గ సభ్యులు?
ఎ. డా|| సి.నారాయణ రెడ్డి బి. వట్టికోట ఆళ్వారుస్వామి
సి. డా|| బిరుదురాజు రామరాజు
డి. పై అందరు
24. ‘అగ్నిధార’ కృతిపతి?
ఎ. డా|| సి.నారాయణరెడ్డి బి. వట్టికోట ఆళ్వారు స్వామి
సి. కాళోజి నారాయణరావు డి. తెలంగాణ ప్రజానికం
25. తెలంగాణ ఉద్యమ కారుల్లోకెల్ల అగ్రగణ్యమైన రచన?
ఎ. రుద్రవీణ బి. తిమిరంలో సమరం
సి. అగ్నిధార డి. పునర్నవం
26. ఈ సమాస పదాలందు సాధారణంగా ‘రుగాగమసంధి’ జరుగుతుంది?
ఎ. తత్పురుషం బి. ద్వంద్వ సమాసం
సి. రూపక సమాసం డి. కర్మధారమం
27. జతపరుచులు:
1. కాళోజి ఎ. జీవనయానం
2. దాశరథి రంగాచార్య బి. యాది
3. సామల సదాశివ సి. శతపత్రము
4. గడియారం రామకృష్ణశర్మ డి. నాగొడవ
1 2 3 4
ఎ) బి సి డి ఎ
బి) డి ఎ బి సి
సి) డి సి ఎ బి
డి) డి సి బి ఎ
28. డా|| దాశరథి కృష్ణమాచార్య స్వీయచరిత్ర?
ఎ. యాత్రాస్మృతి బి. జీవనయానం
సి. ఆలోచనాలోచనాలు డి. నవమి
29. డా|| పి.యశోదారెడ్డి రచనలు ఇవి..?
ఎ. మహాలక్ష్మి ముచ్చట్లు, పునర్ననం
బి. స్వర్ణకమలాలు, బలిపీఠం, స్వేచ్ఛ
సి. మావూరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల
డి. పరిష్కారం, ఎర్రపావురాలు, చురకలు
30. ఛేకానుప్రసాలంకారంలో హల్లుల జంట ఇలా రావాలి?
ఎ. అర్థంభేదంతో, అవ్యవధానంగా
బి. అర్థభేదంతో, మళ్ళి మళ్ళి
సి. తాత్పర్యభేదంలో, వెంటవెంటనే
డి. అర్థభేదంతో, వ్యవధానంగా
31. కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్ర నాయక శతకంలో ఉన్నది?
ఎ. వ్యాజోక్తి బి. వక్రోక్తి
సి.సహౌక్తి డి.అతిశయోక్తిల
32. కథానికకు ప్రధాన లక్షణాలు?
ఎ. విస్తృతి, సమగ్రత బి. నిర్భత, బహు సంఘటక నిక్షిప్తం
సి. వివరణాత్మకత, పాత్రబాహుళ్యం డి. సంక్షిప్తత, ఏకాగ్రత
33. కొంత స్వర ధర్మం, కొంత వ్యంజన ధర్మం ఉన్న వర్ణాలు?
ఎ.ఊష్మాలు బి. అంతస్థాలు సి.స్పర్శాలు డి.నాదాలు
34. సోమసుందర వజ్రాయుధంలో ఇతివృత్తం?
ఎ.స్వతంత్ర పోరాటం
బి.ప్రత్యేకాంద్రోద్యమం
సి.తెలంగాణ సాయుధపోరాటం
డి.వర్గపోరాటం
35. క్షుణ్ణ, విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆమత్త పరచే పఠనం?
ఎ.ఆదర్శ పఠనం బి. మౌనపఠనం
సి.ప్రకాశపఠనం డి.మండూక ప్లుతి పఠనం

సమాధానాలు
1.సి 2.డి 3.ఎ 4.సి 5.బి
6.ఎ 7.డి 8.బి 9.సి 10.ఎ
11.సి 12.సి 13.బి 14.సి 15.డి
16.ఎ 17.బి 18.సి 19.బి 20.ఎ
21.బి 22.సి 23.డి 24.బి 25.సి
26.డి 27.బి 28.ఎ 29.సి 30.ఎ
31.ఎ 32.డి 33.బి 34.సి 35.బి
– తెలుగు సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీకళాశాల, శేరిలింగంపల్లి.
నానాపురం నర్సింహులు
9030057994

Spread the love