అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బందు ఇవ్వాలి

– తాడ్వాయి మండల బిసి బంద్ ఎంపికలో అవకతవకలు
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్
నవతెలంగాణ- తాడ్వాయి
అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బందు ఇవ్వాలని, తడ్వాయి మండలంలో బీసీ బంద్ ఎన్నికలో భారీ అవకతవకలు జరిగాయని సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బులు దేవేందర్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లు దేవేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కుల వృత్తుల అభివృద్ధి కోసం అందిస్తున్న బీసీ బంద్ ఎంపికలో మండలంలో భారీగా అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ధ్వజమెత్తారు. మండలంలో 320 మంది లబ్దిదారుల దరఖాలు చేసుకోగా కేవలం 25 మందికి ఎంపిక చేశారని అన్నారు. ఊరుకు ఒకటి రెండు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. బీసీ బందు అప్లై చేసుకున్న అర్హులందరికీ, బీసీ బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు కూడా రెండో విడత గొర్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు అవకతవకల పై విచారణ చేపట్టి హర్హులందరికి అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి స్థానిక సర్పంచి ఇర్ప సునీల్ ధొర, మాజీ సర్పంచులు బెజ్జూరి శ్రీనివాస్, ముజఫర్ హుస్సేన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సాంబయ్య, నాయకులు సాదు చక్రపాణి, కల్తీ సురేష్, పాక రాజేందర్ అల్లెం సాంబశివరావు, ఎనగంటి నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love