నవతెలంగాణ – మీర్ పేట్
తెలంగాణ రికాగ్నిజ్డ్ స్కూల్ మేనేజిమెంట్స్ అసోసియేషన్ (ట్రాస్మా) రంగారెడ్డి జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం కన్వీనర్ లార్డ్స్ విద్యాసంస్థల చైర్మన్ సిద్దాల బీరప్ప, కో కన్వీనర్ గా బోళ్ల శ్రీకాంత్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ఒకే తాటిపై తీసుకు రావడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘంను దింతో బలోపేతం చేసేందుకు వీలవుతుందని చెప్పారు. ప్రతి పాఠశాల యాజమాన్యం 2023-24 మరియు 2024-25 సంవత్సరానికి తమ సభ్యత్వ రుసుమును చెల్లించి సభ్యత్వంను తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉంటే సమస్యలపై ప్రశ్నించడానికి, మన హక్కులను అడగడానికి ప్రభుత్వంపై సమస్యపై పోరాటం చేయటానికి సాధ్యామవుతుందని పేర్కొన్నారు. అందుకే ప్రతిఒక్కరు సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9618804567/8099511169 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.