రిజిస్టార్ కనకయ్య కి శుభాకాంక్షల వెల్లువ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శనివారం ఆయనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మర్యాదపూర్వకంగా వేరువేరుగా కలిసి శుభాకాంక్షలను తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కనకయ్యను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు శాలువాతో ఘనంగా సత్కరించారు. తెలంగాణ యూనివర్సిటీ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్, టీయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్. దత్త హరి, వర్సిటీ ఔట్సోర్సింగ్ అధ్యక్షుడు సురేష్,కార్యదర్శి బికోజి తోపాటు తదితరులు ఉన్నారు.

Spread the love