తమ్ముడిని గొంతు కోసి చంపిన అన్న

నవతెలంగాణ-నల్లబెల్లి
సొంత తమ్ముడిని ఆస్తి తగాదాల కోసం గొంతు కోసి చంపిన అన్న. మండలంలోని నందిగామ గ్రామంలో శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తమ్ముడిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుండే రవి, కుమార్ సొంత అన్నదమ్ములు. వారికి ఇంటి స్థలం విషయంలో తరచూ గొడవ పడుతూ కుటుంబాల తగాదాలతో చాలాసార్లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అన్న రవి తమ్ముడు అయినా కుమారును మెడపై కత్తి పెట్టి గొంతు కోశాడు. గొంతు కోయగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి మొండయ్య, తల్లి ఐలక్క, హత్య చేసిన నిందితుడు రవి పరారీలో ఉన్నట్లు గ్రామస్తుల సమాచారం.

Spread the love