నవతెలంగాణ – హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్ నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. కాగా మరో 60 గ్రూప్ -1 పోస్టులకు కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం పోస్టులతో కలిపి త్వరలోనే గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.