మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక

నవతెలంగాణ హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఆయాచోట్ల ఉప ఎన్నికలు నిర్వహించనుంది. తెలంగాణలోని కంటోన్మెంట్‌ స్థానానికి మే13న ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అదే రోజు రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ సైతం జరగనుంది.  ఇటీవల రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించడంతో  ఈ స్థానం ఖాళీ అయింది.

Spread the love