ఢిల్లీకి బండి నష్టనివారణలో భాగమే

– గ్రూపులపై జాతీయ నాయకత్వం ఆగ్రహం
– ఎన్నికల వేళ కలిసిపోవాలని సూచించే అవకాశం!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో బీజేపీ నేతల మధ్య రాజుకున్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కుస్తీలు పడుతూనే ఉన్నది. తెలంగాణలో ఈటల, బండి గ్రూపుల మధ్య సయోధ్యను కుదుర్చలేక తలలు పట్టుకుంటున్నది. ఈటల, కోమటిరెడ్డితో సమావేశం అనంతరం బండినీ హస్తినకు రావాలని కబురు పంపింది. దీంతో హుటాహుటిన తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని సోమవారమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అధ్యక్ష పదవి మార్పు ఉండకపోయినప్పటికీ …ఈట ల స్ట్రోక్‌తో బండికి గట్టి క్లాస్‌పీకే అవకాశం ఉందని ప్రచారం జరుగు తున్నది. జేపీ నడ్డా, అమిత్‌షా, పలువురు సీనియర్‌ నేతలు, మంత్రులతో బండి సమావేశమయ్యే అవకాశ ముందని తెలిసింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో వరుస సమావేశాలు రాజకీయం గా ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. వాటి వెనుక ఇంకేమైనా మర్మం ఉందా? అన్న ధర్మ సందే హమూ వ్యక్తమవుతున్నది. కర్నాటకలో చావుదెబ్బతిన్న తర్వాత కాషాయ పార్టీకి తెలంగాణలో ఏదీ కలిసి రావడం లేదు. లిక్కర్‌ స్కామ్‌తో బీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టాలని చూసి సైలెంట్‌ అయిపోయింది. కవితను అరెస్టు చేయకపోవడం వెనుక బీఆర్‌ఎస్‌- బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందన్న ప్రచారంతో కమలం పార్టీ ప్రతిష్ట మరింత మసకబారింది. మరో వైపు సొంతపార్టీలోని నేతలే ఒకరిపై ఒకరు వివాదా స్పద కామెంట్లు చేసుకోవడం, రాష్ట్ర నాయకత్వం మార్పు వంటి అంశాలు పార్టీకి చేటు చేశాయి. ఆధి పత్య పోరుతో పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండ టంతో ఇక్కడ ‘రాజూ నేనే..మంత్రీ నేనే’ అన్నట్టుగా బండి వ్యవహరిస్తున్నారనే విమర్శలు బాహాటంగానే వెల్లువెత్తుతున్నాయి.
ఆయన ఒంటెత్తు పోకడపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అధిష్టానమూ ఆయన కు అతి స్వేచ్ఛ ఇవ్వడమూ గ్రూపుల పోరుకు దారితీసిందనే ప్రచారముంది. ఈ పరిణామాల నేప థ్యంలోనే పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్న రాజగోపాల్‌ రెడ్డి, ఈటలను బుజ్జగించేందుకు బీజేపీ నానా పాట్లు పడుతున్నది. తన అనుమా నాలను నివృత్తి చేయా లని అధిష్టానాన్ని ఈటల గట్టిగా అడిగినట్టు తెలిసిం ది.బీఆర్‌ఎస్‌లో నెంబర్‌ టూగా ఉండి బీజేపీలో చేరి న తనను ‘అసమర్థుడు’ గా చిత్రీకరించే ప్రచారానికి బండి గ్రూపు పూనుకున్నదని ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలని బండికి అధిష్టానం కబురు పంపిందని తెలి సింది. నిలువునా చీలిన పార్టీని గాడిలో పెట్టేందుకు జాతీయ నాయకత్వం ఇప్పుడు తలలు పట్టుకుంటు న్నది. ఎన్నికల వేళ కలిసి కట్టుగా పనిచేయాలనీ, వివాదాస్పద వ్యాఖ్యలు చే యొద్దని ఈటల, రాజ గోపాల్‌రెడ్డికి హితబోధ చేసినట్టు ప్రచారం జరుగు తున్నది. అదే సమయంలో బండినీ ఢిల్లీకి పిలిపిం చింది. తన తీరు మార్చు కుని నేతలను కలుపుకు పోవాలని హెచ్చరించే అవకాశముంది. ఇదే సమ యంలో మరోమారు ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు మళ్లీ జోరందుకున్నాయి.

Spread the love