మున్నూరు కాపు సంఘానికి 10 లక్షల రూ.ల సిడిపి నిధులు మంజూర్

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  గణేష్ బిగాల బాల హనుమాన్ మున్నూరు కాపు సంఘం భవనం నిర్మాణం కొరకు 10 లక్షల రూ.లు ఎమ్మెల్యే కోట సి.డి.పి. నిధులు బుధవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంజూరు చేశారు. బాల హనుమాన్ మున్నూరుకాపు సంఘం సభ్యులకు క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్ కాపీని అందచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, సభ్యులు బొల్లం నరేందర్, కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love