చంద్రగిరి అశోక్ కు ఎమ్మార్పీఎస్ కు సంబంధం లేదు

– మంథని నియోజకవర్గ ప్రచార కమిటీ సభ్యుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ 
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎమ్మార్పీఎస్ కు చంద్రగిరి అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉత్తర్వుల మేరకు అశోక్ ను ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లుగా ఎమ్మార్పీఎస్ మంథని నియోజకవర్గ ప్రచార కమిటీ సభ్యుడు, మహాదేవ్ పూర్ మండల అధ్యక్షుడు, బెల్లంపల్లి సురేష్ మాదిగ, కాటారం మండల అధ్యక్షుడు మంథని చిరంజీవి మాదిగ తెలిపారు. బుధవారం కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ ఒక నిబద్ధత గల క్రమ శిక్షణ గల సంఘముగా గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తోందన్నారు. జాతి చివరి దశ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ ఒక చంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని జాతి బాగుపడాలన్న ఆలోచన మేరకు బీజేపీకి మద్దతు తెలపడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు మాదిగ ఉపకులాలు అభివృద్ధి చెందే సానుకూలమైన వాతావరణాన్ని కల్పించిన బీజేపీ అండగా ఉంటూ వర్గీకరణ చేస్తాం అంటూ మన పక్షాన నిలబడ్డ బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు తెలపడం జరిగిందన్నారు. అందులో భాగంగా కొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం జాతి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కోసం కొందరు వ్యక్తులు ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుంటూ ఎమ్మార్పీఎస్ సబ్ డివిజన్ ఇన్చార్జిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నాం అంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ ఉత్తర్వుల మేరకు  బెల్లంపల్లి సురేష్, మంథని చిరంజీవి మాదిగ అశోకుని సస్పెండ్ చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మార్పీఎస్ పేరు చెప్పుకొని సంఘనియమ నిబంధనలకు పాటించకుండా ఏలాంటి విరుద్ధ కార్యక్రమాలు చేసిన చర్యలకు  వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ నాయకులు ఆత్కూరి సారయ్య మాదిగ పాల్గొన్నారు.
Spread the love