అమెరికాలో చైనా మట్టి గ్లాసులు..

 నవతెలంగాణ కోదాడరూరల్: అమెరికాలో చైనా మట్టి గ్లాసులు వాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది అని ఎన్ఆర్ఐ జలగం సుధీర్ తెలిపారు. తన అభిప్రాయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. భారతదేశంలో అనేక కులవృత్తులకు అనేక తరాలుగా ప్రాధాన్యం ఉన్నదన్న విషయం మనం విస్మరించలేనిది. 75 ఏండ్లుగా ఈ వృత్తులకు కోట్ల రుపాయల సబ్సిడిలు ఇచ్చామని ప్రభుత్వాలు చెపుతున్నప్పటికి అనేక వృత్తులు కనుమరుగై పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికరణ వైపుగా నైపుణ్యం లేకపోవటం, అయా వస్తువులకు మార్కెట్ లో సరిగ్గా ప్రమోట్ చేయకపోవటం లాంటి కారణాలు అనేకం. చైనాలో తయారైన మట్టి గ్లాసులు అమెరికాలో వాడుకోవటం చూస్తున్నపుడు అరే మన దేశం నుండి ఇంత మార్కెటింగ్ ఎందుకు చేసుకోలేకపోయినం అనిపించింది. మన దగ్గర కులాలు, వృత్తులు కేవలం ఓటు బ్యాంకులకు, కుల సంఘాల భవనాలకే పరిమితం అవుతున్నాం. అలాంటి అభిజాత్యాలు లేని చైనా తమ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకోగలుగుతుంది.

Spread the love