మా రాష్ట్ర అవతరణను తప్పు పట్టిన మోడీకి బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి

– ప్రజలు ఇచ్చిన తీర్పును మేము చేసిన సేవలు గుర్తింపుగా కెసిఆర్ ప్రభుత్వాన్ని కులగొడతావా? 

– కమ్యూనిస్టుల రా కలిసి పోదాం.. మోడీకి బుద్ధి చెబుదాం… 
– ప్రగతి భవన్ ను జ్యోతిరావు పులి భవన్ గా మార్చాము..
– ఎందరో అమరవీరుల పోరాటాల గడ్డ ..భువనగిరి గడ్డ..
– ఢిల్లీ మోడీకి గల్లి కేడి కి బుద్ధి చెప్పాలి..
– చామల కిరణ్ కుమార్ రెడ్డి నీ గెలిపించండి.. 
– భువనగిరి రోడ్ షోలో రేవంత్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థుల బలిదానాన్ని చూసి సోనియా గాంధీ రాష్ట్ర అవతరణను చేస్తే మోడీ తప్పు పట్టాడని రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్పాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము చేసిన సేవలను గుర్తింపుగా కెసిఆర్ ప్రభుత్వాన్ని కొలవగొడతారా. . లాగులో తొండలు వేస్తారు నలగొండ పోరాట వీరులు. … కమ్యూనిస్టులారా కలిసి పోదాం మిమ్మల్ని అవమానించిన కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెబుదాం. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మోడీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా రోడ్ షోలో పాల్గొని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నల్ సభలో ప్రసంగించారు. భువనగిరి నల్లగొండ అంటేనే పౌరుషం విప్లవం ఉన్న చైతన్యవంతులైన ప్రజల అడ్డా అని పేర్కొన్నారు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చెల్లించి కొమరం భీమ్ ప్రారంభించిన జల్ జంగల్ జమీన్ ఆసరాగా భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటం కు నాంది పలికిందన్నారు. రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి , కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటివారు బానిసత్వానికి అడ్డంగా నిలబడి బాంచన్ దొర అనే నినాదానికి చరమగీతం పలికి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఎందరో అమరులైన త్యాగమూర్తుల గడ్డ  పేర్కొన్నారు .ఇక్కడి ప్రజలను బంధ విముక్తి చేసిన యోధులను స్మరించకుండా ఉండలేమన్నారు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా పేదలకు అండగా ఉండి సొంత నిధులను ఖర్చు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీకు అండగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కేసీఆర్ రాజీనామాలంతా ఎలక్షన్లు కలెక్షన్ల చుట్టే తిరిగాయి అన్నారు, హైదరాబాదులో ఆంధ్రావాలని బెదిరించి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అడవి పందిలా మాదిరిగా బలిసి ఇక్కడ ప్రజలకు నష్టం చేకూర్చిన కేసీఆర్ కు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రిగా పనిచేసిన భూమికి మూడు జానలు లేని వ్యక్తి దొరగారి గడిలో ఉండి సారాలో సోడా కలపడానికి పనికి వచ్చే వ్యక్తిని  మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. తనతోపాటు ముఖ్యమంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని తెలిపారు. కేంద్ర కమిటీ నాకు ముఖ్యమంత్రి పదవి ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయించిందన్నారు. ఆ పదవిని బాధ్యతతో చూసినాను తప్ప అహంకారంతో కూర్చోలేదన్నారు. 18 గంటలు పని చేస్తూ పేదలకు అండగా ఉంటున్నానని తెలిపారు. 60 ఏళ్ల పాలనలో 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణను గడీలో 15 ఏళ్ల పాటు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బందీ చేశావని విమర్శించారు ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే భవనముగా మార్చిన ఆనంద్ తెలిపారు.   కమ్యూనిస్టులను తన అవసరాల మేరకు కడుపులో తలకాయ పెట్టి వారి అవసరాలను తీసుకొని కరివేపాకు లాగా తీసిపారేసిన కేసిఆర్ కు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలి అన్నారు. సిపిఎం సిపిఐ లతో   ఈ ఎన్నికల్లో కలిసి పోదామని ఉపముఖ్యమంత్రి బట్టు విక్రమార్క వెళ్లి కలిశారని తెలిపారు. తమ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీని గద్దె దించడానికి కృషి చేయాలన్నారు. తను కమ్యూనిస్టులను ఈనాడు అవమానించలేదని అలాంటి సంఘటన లేవన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈడీ,సీబీఐ లాంటి సంస్థలను చేరపెట్టి ఈ దేశాన్ని మోడీ విధ్వంసం సృష్టిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే అందరమూ కలిసి పోరాడాలని కోరారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి ఓటు వేసినట్లేనని తెలిపారు .నోట్ల రద్దు, రైతులపై నల్ల చట్టాలు ఇతర అంశాలలో కెసిఆర్ అనే కేడి మోడీ దగ్గర ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.  కవితను తిహారి జైలు నుండి బయటికి తీసుకు రావడానికి మంచి వ్యక్తి అయినా క్యామ ను ముందు పెట్టి బూరకు మద్దతిస్తున్న మోడీ మెప్పు పొందాలని చూస్తున్న కెసిఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఢిల్లీలో మోడీ గల్లీలో కేడీలు ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. 35 లక్షల మంది ఆడబిడ్డలు ఉచితంగా బస్సుల్లో తిరుగుతున్నారని రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందుతుందని ప్రజల ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించినందుకు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించినందుకు,  బిసి గణన చేపడతామని చెప్పినందుకు ఓర్వలేక కారు కూతలు కూస్తూ కేసీఆర్ కడుపు మండుతుంది అన్నారు రాజకీయ అవగాహన లేని కేటీఆర్ ప్రభుత్వం కూలిపోతుందంటే పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ సన్నాసికి ఏమైందని ప్రశ్నించారు. పత్రిక తెలంగాణ రాష్ట్రం పోరాటంలో నల్గొండ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓయూ విద్యార్థుల చర్చల్లో భాగంగా తన మంత్రి పదవిని త్యాగం చేసి నిరాహార దీక్ష చేపట్టారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. సోనియా గాంధీ స్పందించి విద్యార్థుల యొక్క త్యాగాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మోడీ తప్పు పట్టారని అలాంటి వ్యక్తికి ఈ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎయిమ్స్ లో పూర్తి సేవలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ కట్టామన్నారు బయ్యారంలో ఇనుప ప్రాజెక్టు ఏమైందన్నారు. ఐటీ క్యారియర్ ఏమైందని పవర్ ప్రాజెక్టులు ఏమయ్యాయి అని, పాలమూరు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఏమయిందని ప్రశ్నించారు.  రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఇతర అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై వివక్ష చూపుతున్న మోడీకి నలగొండ ప్రజల బుద్ధి చెప్తారు అన్నారు. తను మంత్రివర్గంలో లేక ఇతర పదవులలో సామాజిక న్యాయం పాటిస్తున్నారని తెలిపారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గుత్తా సుఖేందర్ రెడ్డి జానారెడ్డి ఉన్నారని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు ఉన్నారని ఇద్దరి మధ్యనే పోటీ ఉందని అది మెజార్టీ కోసమేనని తెలిపారు ఏ పార్టీతోటి మాకు పోటీ లేదని వివరించారు కాలుష్యం నుండి మూసికి విముక్తి చేస్తామన్నారు పునాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వలు పూర్తి చేస్తామన్నారు గంధం వల్ల ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు యాదాద్రిని యాదాద్రి గుట్టగా మారుస్తామని తెలిపారు కడుపు చేత పట్టుకొని ఆటోలు నడిపిస్తున్న యువత గుట్ట పైకి రాకుండా ఆపేసిన ఘనత కేసీఆర్ అన్నారు అందుకే తను వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరిక వరకు వెంటనే ఆటోలు నడిపించినమని తెలిపారు ఎన్నికల అనంతరం యాదగిరిగుట్టలో ప్రజలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఆగస్టు 15 నాటికి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చెబుతున్న రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు రైతులకు వచ్చే సీజన్లో ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని హామీ ఇచ్చారు.   భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, బోనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చర్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సామెల్, మల్లరెడ్డి రంగారెడ్డి,   కుమ్మిడి ప్రతాపరెడ్డి సిపిఐ సమితి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి
Spread the love