ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాల్సిందే !

– భోపాల్‌ సభలో ప్రధాని మోడీ
– పాట్నా సమావేశం ఫోటో షూట్‌కేనంటూ వ్యాఖ్యలు
భోపాల్‌ : దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలుచేయాల్సి వుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సున్నితమైన ఈ అంశంపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. పాట్నా సమావేశం కేవలం గ్రూపు ఫోటో కోసం జరిగిందేనని విమర్శించారు. సుప్రీం కోర్టు కూడా యూసీసీని అమలు చేయాలని పేర్కొంటుండగా, ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడేవారు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఒక దేశంలో రెండు వ్యవస్థలు ఎలా వుంటాయని ఆయన ప్రశ్నించారు. భోపాల్‌లో పార్టీ కార్యకర్తలను ద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. వారు కేవలం అవినీతికి మాత్రమే ‘హామీ’ ఇవ్వగలరని అన్నారు. రూ.20లక్షల కోట్ల విలువ చేసే కుంభ కోణాల్లో వారు ఇరుక్కున్నారని విమర్శించారు. పాట్నాలో ఈ నెల 23న జరిగిన సమావేశం కేవలం డజనుకుపైగా పార్టీలు ఫోటో షూట్‌ కోసం జరిపిన సమావేశమంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాలను, బుజ్జగింపుల పంథాను తమ పార్టీ అనుసరించ బోదన్నారు. కేవం ముస్లింలను తప్పు దారి పట్టించి, వారిని రెచ్చగొట్టేందుకే యూసీసీని ప్రతిపక్షం వాడుకుంటోందని మోడీ విమర్శిం చారు. ”మీరు ఒక్క మాట చెప్పండి నాకు, ఒక ఇంట్లో ఒక సభ్యుడికి ఒక చట్టం, మరో సభ్యుడికి మరోచట్టం ఎలా వుంటుంది? అటువంటపుడు ఆ ఇల్లు సరిగా పనిచేస్తుందా? మరి ఇలాంటి ద్వంద్వ వ్యవస్థలు వున్న దేశం ఎలా పనిచేస్తుంది? రాజ్యాంగంలో కూడా అందరికీ సమాన హక్కులు అని ప్రస్తావన వున్న విషయాన్ని మనం గుర్తుం చుకోవాలి” అని మోడీ అన్నారు. ”వీరు (ప్రతిపక్షా లు) మాపై ఆరోపణలు చేస్తున్నారు, కానీ నిజా నికి వారు ముసల్మాన్‌, ముసల్మాన్‌ అని నినదిస్తు న్నారు. ముస్లింల ప్రయోజనాల కోసమే వారు నిజంగా పనిచేస్తున్నట్లతే విద్య, ఉద్యోగాల్లో ముస్లిం కుటుంబాలు వెనకబడరాదు.” అని అన్నా రు. కొంతమంది ఆచరించే బుజ్జగింపు విధానాలు దేశానికి వినాశకరమని మోడీ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో బీజేపీ నిర్వహించిన ”మేరా బూత్‌ సబ్సే మజ్‌బూత్‌” ప్రచార కార్యక్రమంలో ప్రధాని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ముస్లి ంలో వెనుకబడిన తరగతి అయిన పస్‌మందా ముస్లింలను కనీసం వారితో సమానంగా గుర్తిం చడం లేదని, ఓటు బ్యాంక్‌ రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు. వారికి సమాన హక్కులు లేవని, ఎలాంటి ప్రయోజనాలు అందవని, వారిని అంటరానివారు గా చూస్తారని విమర్శిచారు. మూడుసార్లు తలాక్‌ చెప్పే పద్ధతికి మద్దతివ్వడ మంటే ముస్లిం ఆడపిల్లలకు తీవ్రంగా అన్యాయం చేయడమేనని అన్నారు. ఈజిప్ట్‌లో 80,90ఏళ్ళ క్రితమే దీన్ని నిషేధించారని అన్నారు. ఇది అంత అవసరమే అనుకుంటే పాకిస్తాన్‌, కతార్‌, ఇతర ముస్లిం దేశాల్లో ఎందుకు నిషేధించారని ప్రశ్నించారు. దీనివల్ల మొత్తంగా కుటుంబాలు నాశనమై పోతాయన్నారు. కుటుం బ రాజకీయాలు, కుటుంబం నడిపే పార్టీలపై ఆయన వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ కు ఓటు వేయాలని, అఖిలేష్‌కు ప్రయోజనం చేకూర్చాలం టే సమాజ్‌వాదీకి ఓటు వేయాలని అన్నారు. కెసిఆర్‌ కుమార్తె బాగుపడాలంటే బిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, కరుణానిధి కుటుం బానికి లబ్ది చేకూరాంటే డిఎంకె ఓటు వేయాలని కోరారు. ఇలా ఆర్‌జెడి, ఎన్‌సిపి, నేషనల్‌ కాన్ఫరెన్‌్‌స పార్టీ లను కూడా ప్రస్తావించారు. ప్రతిపక్షాల ఐక్యతపై కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

Spread the love