నవతెలంగాణ-భిక్కనూర్
మండల పరిధిలోగల ఎంఎస్ఎన్ కెమికల్ పరిశ్రమపై సోమవారం కాచాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ వీ డి సి అధ్యక్షులు మైపాల్ ఆధ్వర్యంలో పలు యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వెళ్ళి కెమికల్ పరిశ్రమ ద్వారా వస్తున్న వ్యర్థ పదార్థాల ల్యాబ్ రిపోర్టులను ఆయనకు వివరించి, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల కాపీలను తెలియజేసి తక్షణమే కెమికల్ పరిశ్రమపై చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశించాలని గ్రామస్తులు కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కెమికల్ పరిశ్రమ ద్వారా ఏ గ్రామానికి ముప్పు జరిగినా సహించేది లేదని, సంబంధిత అధికారులకు పూర్తి సమాచారం అందిస్తానని హామీ ఇచ్చారు.