– సభకు రండి టీడీపీ అధ్యక్షుడు కాసానికి
– కేయూ విద్యార్ధి జేఏసీ నేతల వినతి
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు కలిశారు. ఈ కమిటీ మార్చ్ 25న నిర్వహించే ఛలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కాసానిని కోరారు. విద్యార్థి,నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జ్ఞానేశ్వర్ దష్టికి తీసుకురావడంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు.ఈ మేరకు సోమవారం కాసానికి వినతిపత్రం సమర్పించారు.విద్యార్థి, ఉద్యమకారులు చేపట్టే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన కేయూ విద్యార్థి జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు.