కాంగ్రెస్ గెలుపు ఖాయం..

– తుమ్మల రాకను స్వాగతిస్తూ…
– కమ్యూనిస్టులను సైతం మోసం చేసిన ఘనుడు కేసీఆర్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొంది, వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆశాభావం వ్యక్తం చేసారు.  సోమవారం మండలంలోని ఉసిర్లగూడెం లో పర్యటించి  అనారోగ్యంతో బాధపడుతున్న ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఉప్పల రాజశేఖర్ తండ్రి బాబూరావును పరామర్శించారు.  అనంతరం అశ్వారావుపేట లోని ఓ లాడ్జీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ కు ప్రజాదరణ బాగుందని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమైందని, దళిత బంధు పథకం పేరుతో దళితులను దగా చేసిందని ఆరోపించారు.గ్రామానికి ఒక్కటి కుడా ఈ పథకం అందించలేక పోయారని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 లక్షల ఎకరాల పోడు భూములు ఉంటే కంటి తుడుపు చర్యగా కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.ఈ పోడు పట్టాలు కుడా సక్రమంగా ఇవ్వలేదని,వాటిలో సర్వే నంబర్ లు,సరిహద్దులు లేవన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికి పోడు పట్టాలు అందిస్తామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో మోసాలు జరుగుతున్నాయని,లక్షలాది ఎకరాలు మాయమైనట్లు ఆరోపించారు.పార్టీ అధికారంలోకి రాగానే తొలుత ధరణి ని రద్దు చేస్తామని అన్నారు.
     కమ్యూనిస్టు పార్టీలను ఉప ఎన్నికల్లో వాడుకొని,వారిని కుడా మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సీనియర్ నాయకులు,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని, ఆయన పార్టీలోకి వస్తే మరింత బలోపేతం అవుతుందన్నారు. కాంగ్రెస్‌ పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని,ఏదైనా మాట్లాడ వచ్చని పరోక్షంగా ఇటీవలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై వ్యాఖ్యలు చేసిన మాజీ తాటి వెంకటేశ్వర్లు ను ఉద్దేశించి అన్నారు.అసెంబ్లీ టికెట్లను పూర్తిగా సర్వే ఆధారంగానే కేటాయిస్తారని,టికెట్ ఎవరికిచ్చినా గ్రూపులకు అతీతంగా కలిసి పని చేస్తామని అన్నారు.జిల్లాలోని ఐదు అసెంబ్లీ సీట్లను అత్యధిక మెజార్జీ తో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో  మహిళా కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్, ములకలపల్లి జడ్పీటీసీ సభ్యురాలు సున్నం నాగమణి,నాయకులు తుమ్మ రాంబాబు,జ్యేష్ట సత్యనారాయణ,ఏనుగుల అర్జున్రావు,మద్దిశెట్టి సత్యప్రసాద్,తాండ్ర ప్రభాకర్, ముష్టిన శిరీష, ఎస్కే బాబా, జుజ్జఃరపు దుర్గారావు పాల్గొన్నారు.
Spread the love