
కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కీర్తిశేషులు ధర్మ అంజిరెడ్డి కుటుంబానికి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు. దివంగత నాయకుదు అంజిరెడ్డి కుటుంబం గత వరదల వల్ల దెబ్బతినగా బుధవారం యూత్ కాంగ్రెస్ నాయకులు నిత్యవసరాలను కొన్ని సామాగ్రిని అందించారు. యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతా క్రాంతి ఈ నిత్యావసరాలను అంజిరెడ్డి కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు యాస రామచంద్ర రెడ్డి, పస్రా గ్రామ ఇంఛార్జి పత్రి మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.