సైక్లోథాన్‌ ర్యాలీ

– పాల్గొన్న డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తాటికొండ స్వప్న పరిమల్‌
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఆదివారం మా ర్వాడీ యువమంచ్‌ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినో త్సవ సందర్భంగా సైక్లోథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సైక్లోథాన్‌ 3.0 ర్యాలీ ఆదివారం ఉదయం 7 గంటలకు కొనసాగింది. ఆదివారం ఆల్‌ ఇండి యా మార్వాడీ యువమంచ్‌ పిలుపు మేరకు సైక్లో థాన్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని తాండూ రు డీఎస్పీ జీ.శేఖర్‌ గౌడ్‌ హాజరై సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి గం గోత్రి స్కూల్‌ నుంచి విలియంమూన్‌ చౌరస్తా, ఇందిరా చౌరస్తా, శాంత్‌ మహాల్‌ చౌరస్తా, డీఎస్పీ కార్యాలయం, మార్ప బజార్‌ నుంచి గగ్రాని ఫంక్షన్‌ హాల్‌ వరకు కొనసాగింది. ర్యాలీలో దాదాపు 200 మంది విద్యార్థులు, సైకిలిస్ట్‌ సభ్యులు, మంచ్‌ సభ్యు లు యాత్రలో పాల్గొన్నారు. పురవీధుల గుండా ర్యాలీలో సైకిలింగ్‌పై ప్రజలను చైనత్య పరిచేలాల నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం గగ్రానీ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌, చైర్‌ పర్సన్‌ స్వప్న పరిమళ్‌ ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అంద జేశారు. వారు మాట్లాడుతూ సైక్లింగ్‌ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ప్రతిరోజు 10 కిలో మీటర్లు సైకిలింగ్‌ చేస్తే ఆరోగ్యం గా ఉంటారన్నారు. కార్యక్రమంలో మార్వాడీ యువ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్‌ సార్డా, తాండూరు అధ్యక్షులు బ్రిజ్‌ మోహన్‌ బూబ్‌, కార్యదర్శి కిషన్‌ రాఠి, కోశాధికారి అరుణ్‌ సార్డా, ప్రోగ్రామ్‌ చైర్మన్‌ భరత్‌ దేవ్‌డా, మాజీ అధ్యక్షులు రమేష్‌ చంద్రబూబ్‌, సూపర్య ప్రకాష్‌ సోమాని, కుంజ్‌ బిహారీ సోనీ, సన్ని అగ్రవాల్‌, పవన్‌ సోని, దినేష్‌ పర్తానీ, అనిల్‌ సార్డా, లక్ష్మీనారాయణ బూబ్‌, ఆశిష్‌ సార్డా, గంగోత్రి స్కూల్‌ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Spread the love