జైపూర్ : తెలుగు టాలన్స్ తొలి ఓటమి చవిచూసింది. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్)లో ఆదివారం జైపూర్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐరన్‌మ్యాన్ చేతిలో 26-30తో పరాజయం పాలైంది. ప్రథమార్థం ముగిసే సరికి 14-12తో రెండు గోల్స్ ముందంజలో నిలిచిన తెలుగు టాలన్స్ విరామం అనంతరం మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. తెలుగు టాలన్స్ ఆటగాడు నసీబ్ సింగ్ 10 గోల్స్‌తో మెరిసినా.. ఐరన్‌మ్యాన్ ప్లేయర్ అంకిత్ కుమార్ 9 గోల్స్ ప్రదర్శనతో ఆ జట్టును విజేతగా నిలిపాడు. నేడు ఢిల్లీ పాంజర్స్‌తో తెలుగు టాలన్స్ తలపడనుంది.