అన్సన్ పల్లి లో నేడే పోడు భూముల పట్టాల పంపిణీ..

– హాజరు కానున్న ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
– బీఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని అన్సన్ పల్లి చౌరస్తా ధర్పల్లి రోడ్డు వద్ద ముదిరాజ్ ఫంక్షన్ హాల్ లో పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గోనున్నట్లు‌ బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్ శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు.శనివారం ఉదయం.10:30 గంటలకు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్అన్సన్ పల్లి చౌరస్తా పెద్దమ్మ గుడి అర్&బి దర్పల్లి రోడ్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ కుపాల్గొని పోడుభూముల పట్టాలు పంపిణీ చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమానికి బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపిటిసిలు ప్రజా ప్రతినిధులు సమయానికి పాల్గొని పోడు పట్టల కార్యక్రమం విజయవంతం చేయాలని చిలివేరి గంగాదాస్ సూచించారు.

Spread the love