– టీయూలో ఎంఫోర్స్మెంట్ అధికారుల హల్ చల్..
– వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లు గయాబ్..
– హార్డ్ డిస్క్ లు స్వాదినం…
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వస్తున్న కథనాలు,వైస్ ఛాన్సలర్ వర్సేస్ తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుల మధ్య నువ్వ నేన అన్న రితిలో గోడలు తారాస్థాయికి చేరింది.ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పారంపార నేలకోన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఏకకాలంలో యూనివర్సిటీ లోని పరిపాలన విభాగం తోపాటు ఆర్ట్స్ కాలేజి ఇతర చోట్ల దాడులు నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ భవనంలోని వివిధ విభాగాలలో విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ అధికారులు దాడులు కొనసాగిస్తు అయా కార్యాలయాల్లో ఉన్న వివరాలను, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకుని పాలు రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు.ఉదయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవిందర్ గూప్త యూనివర్సిటీ కి వచ్చి రెండు గంటల పాటు పారిపలన భవనం లోనే ఉన్నారు.కోద్ది సెపటిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాక ముందే వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ లోని పారిపలన భవనం నుండి వేళ్ళని పోయారు.రిజిస్ట్రార్ కనకయ్య రిజిస్ట్రార్ కార్యాలయాని వచ్చి కోద్ది సెపాటికే తిరిగి వేళ్ళిపోయిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షణాల్లోనే పరిపాల భవనం చేరుకున్నారు.యూనివర్సిటి లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలకు వచ్చిన వెంటనే అధికారుల్లో టేన్షన్, భయాందోళనలు వ్యక్తమయ్యాయి.పరిపాలన విభాగం లోని సందర్శించి, కార్యాలయ సిబ్బంది ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.గత కోంత కళంగా యూనివర్సిటీలో అవినీతి చోటు చేసుకుందని, అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని యూనివర్సిటీ లోని పలు విద్యార్థి సంఘాల నాయకులు, తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు ఆరోపణలు చేసి వేంటనే ప్రభుత్వానికి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ లింబద్రి, ఎసిబి అధికారులు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తోపాటు ఇతర శాఖల కు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.అదే కోవలోనే ప్రభుత్వమే రంగంలోకి దిగి యూనివర్సిటీ లో చోటు చేసుకున్న పరిణామాలను సిరియస్ గా తిసుకుని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.యూనివర్సిటిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 10 మంది పాల్గొని దాడులు చేస్తున్నారు.ఎఓ కార్యాలయం, ఖజానా విభాగం, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ లో తనిఖీలు జరుపుతున్నారు. పరిపాలన భవనంలోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను అధికారులు స్వాధీనపరుచు కున్నారు. యూనివర్సిటీలోని పలు శాఖలకు చెందిన సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారిస్తున్నారు.