ఏషియన్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు ఘన సన్మానం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈనెల 13 నుండి 17 వరకు తైవాన్ దేశంలో తై‌పి లో జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో భారత జట్టు తరఫున జిల్లా క్రీడాకారులు ఎస్ సౌమ్యరాణి (కెప్టెన్) జి సౌందర్య, జి సాత్విక, జి శ్రావిక & డి.సరియు (సుద్ధపల్లి సాఫ్ట్ బాల్ రాష్ట్ర అకాడమీ క్రీడాకారులు) భారత జట్టు తరఫున పాల్గొన్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోదావరి క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గోదావరి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ‌ సుద్ధపల్లి పాఠశాల క్రీడా మైదానంలో ఆడిన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీలలో రాణించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే విదంగా,భారత జట్టు బలంగా ఉండేవిధంగా శిక్షణ కొనసాగిస్తా మన్నారు. క్రీడాకారులు ఒలంపిక్స్ లక్ష్యంగా లక్ష్య సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ నుండి ఏళ్ళవెలల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్, పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ దీప్తివాని, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత,పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు నల్లూరి లత, సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక, ఉపాద్యాయులు సుకన్య, ఉమరాని, సంజీవ, పద్మావతి, స్వర్ణలత, క్రీడాకారులు పాల్గొన్నారు.

Spread the love