జులై 2న సరస్వతి శిశుమందిర్ లో జిల్లా స్థాయి జూనియర్ టాలెంట్ టెస్ట్

నవతెలంగాణ – సిద్దిపేట
పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో పోటీ తత్వం పెరగడంతో పాటు విజ్ఞానం పెరుగుతుందని,  జులై 2న సిద్దిపేట సరస్వతి శిశుమందిర్ లో జిల్లా స్థాయి జూనియర్ టాలెంట్ టెస్ట్ ఉంటుందని  శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షులు తడకమడ్ల ఈశ్వరయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జూన్ 2న సిద్దిపేట సరస్వతి శిశుమందిర్ లో నిర్వహించనున్న జిల్లా స్థాయి జూనియర్ టాలెంట్ టెస్ట్ కరపత్రికలను విద్యాపీఠం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్టిక్ లెవెల్ జూనియర్ టాలెంట్ టెస్ట్ పోటీలకు విద్యార్థుల పేరు నమోదు ప్రక్రియ ప్రారంభించమన్నారు. ఈ పోటీ పరీక్షలు రెండు లెవెల్స్ లో కొనసాగుతాయని నాలుగు, ఐదవ తరగతి విద్యార్థులకు లెవెల్ వన్ పరీక్షలు, 6, 7వ తరగతి విద్యార్థులకు లెవెల్ టు గా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి రెండు లెవెల్స్ లో మొదటి బహుమతి 5000, రెండవ బహుమతి 3000, మూడో బహుమతిగా వెయ్యి రూపాయల నగదు ప్రోత్సాహం అందిస్తామన్నారు. అలాగే నాలుగు, ఐదు, ఆరు, ఏడవ తరగతులలో మొదటి స్థానంలో నిలిచిన వారికి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం మొత్తం పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొనేవారు రూ 100 రిజిస్ట్రేషన్ ఫీజు సరస్వతి శిశుమందిర్ లో చెల్లించాలని సూచించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు 9966932727 నెంబర్ కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట జిల్లా లోని అన్ని పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు పెద్ది వైకుంఠం, ప్రధానాచార్యులు మోతుకు నరేష్ కుమార్, కమిటీ సభ్యులు తుజాల్పురం కాశీనాథ్, గంప సుధాకర్, నారదాసు సతీష్, మోతుకు అనిత పాల్గొన్నారు.

Spread the love