దళితుల భూమిలో యాదవ సంఘం భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దు

సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మంచాల
దళితుల భూమిలో యాదవ భవనానికి అనుమతి ఇవ్వొద్దని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.అనంతరం తహసీల్దార్‌ అనితకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ జపాల గ్రామంలోని సర్వే నెంబర్‌ 96లో గత 50 ఏండ్ల నుంచి దళితులు కబ్జాలో ఉన్నారు.ఆ భూమిలో యాదవులు భవనం నిర్మించాలని ప్రయత్నం చేయగా, దళితుల భూమిలో యాదవ భవన నిర్మాణానికి అను మతి ఇవ్వొద్దని గతంలోనే జిల్లా కలెక్టర్‌కు, తహసీల్దార్‌లకు వినతి పత్రం అందజేసినట్టు గుర్తు చేశారు. ఈ నేపథ ్యంలో తహసీ ల్దార్‌ ఆ స్థలాన్ని పరిశీలించి, యాదవ భవ నానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని చెప్పినట్టు వెల్లడించారు. గత కొన్ని రోజులగా ప్రభుత్వ సర్వర్‌ వచ్చి సర్వే చేస్తారనీ దళితులకు ఏలాంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, దళితుల భూమిలో యాదవ భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు లెనిన్‌, హాఫిజ్‌ పాషా, ఆ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు నోముల కృష్ణ, పార్టీ శాఖ కార్యదర్శులు నోముల హరికృష్ణ, పార్టీ సభ్యులు నోముల జంగయ్య తదితరులున్నారు.

Spread the love