బృందావన్‌ కాలనీకి తాగునీటిని అందించాలి

– అక్రమ కలెక్షన్లకు అడ్డువేయాలి
– లైన్మెన్ల అక్రమాలకు చెక్‌ పెట్టాలి
– కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌
– జలమండలి టెక్నికల్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు
– నవతెలంగాణ-గండిపేట్‌
బృందావన కాలనీ అక్రమ కలెక్షన్లకు అడ్డుకట్ట వేయాలని కార్పొరేటర్‌ తలారి చంద్రశేఖర్‌ ఆరోపించారు. సోమవారం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గంధం గూడలోని బృందావన్‌ (వీకర్‌ సెక్షన్‌) కాలనీ వాసులతో కలిసి జలమండలి టెక్నికల్‌ ఆఫీసర్‌ ఎల్లమయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందావన కాలనీలో తమ చొరవతో పైపులైన్‌ జంక్షన్‌ ఏర్పాటు చేసి నట్టు చెప్పారు.ఈ పైపులైన్‌ నుంచి తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కాలనీవాసులు దాదా పు 20 నుంచి 30 మంది వరకు డీడీలు కట్టుకున్నట్టు తెలి పారు. పైపులైన్లు వేసి నెలరోజులు గడుస్తున్నప్పటకీ నేటికి తాగునీటి సరఫరా చేయడం లేదన్నారు. కాలనీలో కొంతమందితో జలమండలి లైన్‌మెన్‌లు కుమ్మక్కై, అక్రమ కలెక్షన్‌ ఇస్తున్నట్లు ఆరోపించారు. అక్రమ కలక్షన్లు నిలిప ివేయాలని స్వయంగా విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయం పైన జలమండలి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కరిద్దరి కోసం కాకుండా కాలనీవాసులందరికీ తాగునీటిని అందించే విధంగా కృషి చేయాలన్నారు. పైపులైన్లు ప్రతి ఇంటికీ వేశారనీ, సరఫరా చేసేందుకు అధికారులు ఓపెన్‌ ఉన్న డమ్మీలను మూసి వేయాలని డిమాండ్‌ చేశారు. పక్క కాలనీకి ఇచ్చినట్లు బృందావన కాలనీ కూడా తాగునీటిని అందించాలన్నారు.
టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎల్లమ్మ మాట్లాడుతూ… బృందావన్‌ కాలనీకి త్వరలో తాగునీటిిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డమ్మీలను మూసివేసి తాగునీటిని అందరికీ సరఫరా చేసేందుకు కృషి చేసా ్తమన్నారు. అక్రమ కలెక్షన్లు తీసుకుంటే చర్యలు తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహేశ్వరం రఘు, శ్రీకాంత్‌, ప్రభాకర్‌, శ్రీనివాసు టెక్నికల్‌ ఆఫీసర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Spread the love