ఉపాధి కల్పించిన కాంగ్రెస్ హస్తం గుర్తును మర్చిపోవద్దు

– ధనసరి అనసూయ (సీతక్క)
నవతెలంగాణ – గోవిందరావుపేట
దేశంలో పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకం చట్టాన్ని తెచ్చి ఉపాధి కల్పించిన కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తును మర్చిపోవద్దని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం  మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల పరిశీలన మరియు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు  దనసరి సీతక్క హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నీ గెలిపించి పార్లమెంట్ పంపించి, రాహుల్ ని ప్రధానిని చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు. మహాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్  మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఇదివరకు కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ములుగు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అని, ఎన్నో జాతీయ రహదారులు, వంతెనలు, స్కూళ్లు తీసుకువచ్చిన ఘనత బలరాంనాయక్  ది అని అన్నారు.
నేను మంత్రిగా గెలిచిన మూడు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించా అని, ఇంకా పది కోట్ల రూపాయలు గోవిందరావుపేట మండలంలోని కోటగడ్డ రోడ్డు, దుంపెళ్ళిగూడెం రోడ్డు, రంగాపూర్ రోడ్డు మరియు మండలంలోని అంతర్గత రోడ్ల కొరకు తీసుకువస్తున్న అని, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున, ఎలక్షన్ కోడ్ ముగియగానే వెంటనే ఆ పనులు ప్రారంభించి ములుగు నియోజకవర్గంలోని ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చేసి నిజమైన అభివృద్ధి చేస్తానని అన్నారు. అందుకు మీరంతా ఏకమై బలరాంనాయక్  చేతి గుర్తుపై ఓటు వేసి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని, ఎంపీగా అతను గెలవడం వలన, గిరిజన ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు ఎక్కువగా వస్తాయని, నా చెయ్యికి అతని చెయ్యి కూడా తోడైతే ములుగు నియోజకవర్గం అత్యంత తొందరగా అభివృద్ధి జరుగుతుందని కావున కార్యకర్తలు అందరూ నన్ను ఎలా అయితే భారీ మెజారిటీతో గెలిపించారో అలాగే బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,  జిల్లా, మండల, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, గ్రామస్థులు అందరూ పాల్గొన్నారు.
Spread the love