Friday, August 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీ అంత్యక్రియలకు ముందుతప్పుడు అంచనాలు వేయొద్దు

ఖమేనీ అంత్యక్రియలకు ముందుతప్పుడు అంచనాలు వేయొద్దు

- Advertisement -

అమెరికా, ఇజ్రాయిల్‌కు ఇరాన్ హెచ్చరిక
టెహ్రాన్ :
దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు ఎలాంటి తప్పుడు అంచనాలు వేయవద్దని, దుస్సాహసానికి పాల్పడవద్దని అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను ఖటమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం కమాండర్ మేజర్ జనరల్ అలీ అబ్దోల్లహీ హెచ్చరించారు. ‘ఈ చారిత్రక దినాలలో…మేము ఇరాన్ శత్రువులను ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను, వాటి మిత్రులను తప్పుడు అంచనాలు వేయవద్దని హెచ్చరిస్తున్నాం’ అని తెలిపారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడితే తమ సాయుధ దళాలు తీవ్రంగా, శత్రువు విచారించేలా సమాధా నమిస్తాయని చెప్పారు. దేశ స్వాతంత్య్రాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఖమేనీ హత్య బాధాకరమైన విషాదమని, అది ఇరాన్ దీక్షను మరింత బలోపేతం చేసిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -