దూరదర్శన్ లోగో మార్పు బాధ కలిగిస్తుంది: మాజీ సీఈవో

నవతెలంగాణ – హైదరాబాద్: దూరదర్శన్ లోగో కలర్ మార్చడంపై విమర్శలొస్తున్నాయి. ఎన్నికల వేళ కాషాయ రంగులోకి మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పు అనుచిత చర్యగా ప్రసార భారతి మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ తెలిపారు. ‘స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్కాస్టర్ను కాషాయ రంగులోకి మార్చడం సరికాదు. ఈ నిర్ణయం నాకు బాధ కలిగిస్తోంది. ఎన్నికల వేళ లోగో మార్చడం కోడ్ ఉల్లంఘనే. ప్రస్తుత సీఈవో తీరు సరిగా లేదు’ అని ఆయన తెలిపారు. కాగా, దూరదర్శన్ ఛానల్ లోగోని నీలి రంగు నుండి కాషాయ రంగు లోకి మార్చినట్లు ప్రసార భారతి అధికార ఎక్స్ వేదికగా వెల్లడించారు. మా విలువలు ఎప్పటి లానే ఉంటాయి ఇప్పుడు మేము కొత్త అవతార్ లో అందుబాటులో ఉంటాము అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది వరకు వలె మా న్యూస్ జర్నీ చూస్తూ ఉండండి అని కొత్త డిడి న్యూస్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Spread the love