వృద్ధురాలు  గృహ నిర్బంధం..

నవతెలంగాణ – చండూరు
 స్థానిక మున్సిపల్ కేంద్రంలోని అంగడిపేట లో రోడ్డులో ఉన్న ఓ  వృద్ధురాలు   మూడు నెలలుగా గృహ నిర్బంధంగా మారింది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్ళాక  నాన్న అవస్థలు పడుతుంది. వివరాల్లోకి వెళ్తే స్థానిక మున్సిపల్ కేంద్రంలోని  తిరందాసు లక్ష్మమ్మ  తన ఇంటి ముందు  రెండు గజాల లోతు  డ్రైనేజీ గుంత ఏర్పాటు చేశారు. మూడు నెలలు అయినా ఆ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంటి నుండి బయటకు వెళ్లలేని   పరిస్థితి  నెలకొంది. తనకున్న ఒక కుమారుడు వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. దీంతో ఆమె రోజువారి   నిత్యవసరులకు బయటికి వెళ్లాలంటే  ఇంటి ముందు ఉన్న  డ్రైనేజ్ గుంట వల్ల   ఆమె నాన్న అవస్థలు   పడుతుంది. దీంతో ఆమె ఎవరికి   చెప్పుకోవాలో సతమతమవుతుంది.  అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం 30 కోట్ల  నిధులు విడుదల చేసింది. గుత్తేదారుడి అలసత్వంతో  నిర్మాణ పనులు  ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.  దుకాణాల  షాపుల  ముందు  డ్రైనేజ్ గుంతలు  తొవ్వడంతో వినియోదారులు తమ షాపులోకి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా  సంబంధిత అధికారులు  స్పందించి నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని మున్సిపల్  ప్రజలు కోరుతున్నారు.
Spread the love