జాబ్ కార్డున్న ప్రతి కుటుంబానికి ఉపాది కల్పించాలి

– ఉపాధి హామీ పనులను సందర్శించిన అడిషనల్ డీఆర్ డీఓ వసుమతి 
నవతెలంగాణ – మల్హర్ రావు 
జాబ్ కార్డున్న ప్రతి కుటుంబానికి ఉపాదిహామీ పథకంలో పనులు కల్పించాలని భూపాలపల్లి జిల్లా అడిషనల్ డీఆర్ డీఓ వసుమతి మండల ఉపాది ఏపీఓ హరీష్ ను ఆదేశించారు. బుధవారం మండలంలోని  చూపించాలని రుద్రారం, కొండంపేట గ్రామపంచాయతీల పరిధిలోని  చెరువుల్లో ఫిష్ బ్రీడింగ్ పనులను పరిశీలించారు. కోలతల ప్రకారం పని చేస్తే ఒక్క రోజుకు రూ.300 కూలీ వస్తోందని కూలీలకు వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు కనీస వసతులు మంచి నీళ్లు, నీడ పందిరి,మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పని ప్రదేశంలో కూలీలకు సేద తీర్చుకోవడానికి నీళ్లు, నీడ కోసం చలువ పందిళ్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ హరీష్, ఈసీ మంగీలాల్, టెక్నికల్ అసిస్టెంట్స్ రమేష్, శైలజ, పంచాయతి కార్యదర్శులు చరణ్, కుమారస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్స్ రవిశంకర్, రాజేందర్, మహేష్ ,ఉపాది కూలీలు పాల్గొన్నారు.
Spread the love