రేసులోనే ఇంగ్లాండ్‌!

రేసులోనే ఇంగ్లాండ్‌!నార్త్‌సౌండ్‌ : డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌ సూపర్‌8 ఆశలు సజీవంగా నిలుపుకుంది. గ్రూప్‌-బిలో ఓమన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌ నెట్‌రన్‌రేట్‌గా అమాంతం మెరుగుపర్చుకుంది. స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ (4/11), పేసర్లు మార్క్‌వుడ్‌ (3/12), జోఫ్రా ఆర్చర్‌ (3/12) మ్యాజిక్‌తో ఓమన్‌ 13.2 ఓవర్లలో 47 పరుగులకు కుప్పకూలింది. ఓమన్‌ బ్యాటర్లలో షోయబ్‌ ఖాన్‌ (11) ఒక్కడే రెండెంకల స్కోరు సాధించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 3.1 ఓవర్లలోనే ఊదేసింది. జోశ్‌ బట్లర్‌ (24 నాటౌట్‌), ఫిల్‌ సాల్ట్‌ (12), జానీ బెయిర్‌స్టో (8 నాటౌట్‌) రాణించారు. మరో 101 బంతులు ఉండగానే విజయం సాధించిన ఇంగ్లాండ్‌ నెట్‌రన్‌రేట్‌లో స్కాట్లాండ్‌ను అధిగమించింది. ఇంగ్లాండ్‌ తన చివరి మ్యాచ్‌లో నమీబియాతో ఆడనుంది.

Spread the love