28 మందితో హాకీ ప్రాబబుల్స్‌!

28 మందితో హాకీ ప్రాబబుల్స్‌!– మే 13 వరకు నేషనల్‌ క్యాంప్‌
బెంగళూర్‌ : టోక్యో ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌ హాకీ ఇండియా.. పారిస్‌లోనూ పతకం సాధించేందుకు పట్టుదలగా చెమటోడ్చుతుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ జట్టును ఎంపిక చేసేందుకు హాకీ ఇండియా 28 మందితో ప్రాబబుల్స్‌ జాబితాను విడుదల చేసింది. బెంగళూర్‌లోని సారు సెంటర్‌లో ఆదివారం మొదలైన నేషనల్‌ క్యాంప్‌ మే 13 వరకు కొనసాగుతుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట భారత జట్టు సరిదిద్దుకోవాల్సిన లోపాలపై ప్రధానంగా శిక్షణ శిబిరంలో దృష్టి పెట్టనున్నారు. క్యాంప్‌ అనంతరం భారత జట్టు నేరుగా బెల్జియం, ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. అక్కడ ఎఫ్‌ఐహెచ్‌ ప్రో లీగ్‌లో రెండు అంచెల్లో అర్జెంటీనా, బెల్జియం, జర్మనీ, గ్రేట్‌ బ్రిటన్‌తో తలపడనుంది.
హాకీ ప్రాబబుల్స్‌ : క్రిషన్‌ బహదూర్‌, పిఆర్‌ శ్రీజేశ్‌, సురజ్‌ (గోల్‌ కీపర్లు). హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అమిత్‌, జుగ్‌రాజ్‌ సింగ్‌, సంజరు, సుమిత్‌, అమీర్‌ అలీ (డిఫెండర్లు). మన్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, రవిచంద్ర సింగ్‌, శంషర్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, రాజ్‌కుమార్‌ పాల్‌, విష్ణుకాంత్‌ సింగ్‌ (మిడ్‌ ఫీల్డర్లు). ఆకాశ్‌దీప్‌ సింగ్‌, మన్‌దీప్‌ సింగ్‌, లలిత్‌క ఉమార్‌, అభిషేక్‌, దిల్‌ప్రీత్‌ సింగ్‌, సుఖ్‌జిత్‌ సింగ్‌, గుర్జంత్‌ సింగ్‌, మహ్మద్‌ రహీల్‌, బాబీ సింగ్‌, అరాజిత్‌ సింగ్‌ (ఫార్వర్డ్స్‌).

Spread the love