ప్రయోగాత్మక చిత్రం

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్‌ ప్రెగెంట్‌’. రూపా కొడవాయుర్‌ హీరోయిన్‌గా మైక్‌ మూవీస్‌ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమాలో హీరో సోహైల్‌ ప్రెగెంట్‌గా కనిపించనున్నాడు. తెలుగు తెరపై ఇదొక కొత్త తరహా ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. సినిమా అవుతట్‌ పుట్‌ విషయంలో మేకర్స్‌ సంతప్తిగా ఉన్నారు. రిలీజ్‌కి కూడా ఆగస్టు 18 మంచి డేట్‌గా భావిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మంచి సక్సెస్‌ సాధిస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే మేకర్స్‌ సైతం సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. అందరినీ అలరించే సినిమా’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. సుహాసిని మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – నిజార్‌ షఫీ, సంగీతం – శ్రావణ్‌ భరద్వాజ్‌, ఎడిటింగ్‌ – ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌ – గాంధీ నడికుడికర్‌.

Spread the love