ప్రాజెక్ట్‌ కె అరుదైన ఘనత

వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌ (ఎస్‌డిసిసి) 2023లో లాంచ్‌ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సష్టించనుంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొనె, నాగ్‌ అశ్విన్‌ టీమ్‌తో ఎస్‌డిసిసి వేడుక ఈనెల 20వ తేదీన స్టార్ట్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర టైటిల్‌, ట్రైలర్‌, విడుదల తేదీని లాంచ్‌ చేస్తారు. ‘ఇది భారతీయ ప్రేక్షకులందరికీ గర్వకారణమైన క్షణం. కామిక్‌ కాన్‌ మాకు వరల్డ్‌ స్టేజ్‌’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.

Spread the love