జీ 5 స్ట్రీమింగ్ లైబ్రరీలో తాజాగా చేరిన ఒరిజినల్ ‘వ్యవస్థ’. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఈ థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ, ఇప్పటికే 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో ఆదరిస్తోన్న ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు. ‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుకనే మంచి అవుట్‌ఫుట్ వచ్చింది’ అని దర్శకుడు ఆనంద్ రంగ చెప్పారు. నిర్మాత పట్టాభి చిలుకూరి మాట్లాడుతూ, ‘మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తోంది’ అని తెలిపారు. జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయితేజ దేశ్‌రాజ్ మాట్లాడుతూ, ’20 రోజుల ముందే చెప్పాం. వ్యవస్థతో హిట్ ఇస్తామని. హిట్ కాదు.. జీ5కిది సమ్మర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు. ”వ్యవస్థ’ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు, ఆనంద రంగ, సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు ధన్యవాదాలు’ అని హెబ్బా పటేల్ చెప్పారు.