Thursday, July 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యాన్ని తరలించాలని రైతుల ఆందోళన

ధాన్యాన్ని తరలించాలని రైతుల ఆందోళన

- Advertisement -


ధాన్యం రోడ్డుపై పోసి తగుల బెట్టి నిరసన
నవతెలంగాణ-ఎల్లారెడ్డి

కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ధాన్యం బస్తాలు రోడ్డుపై పోసి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. లారీలు రాకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలను తెప్పించి ధాన్యం బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -