బీసీ విద్యార్థులకు కూడా ఫీజులు.. :గంగుల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రతిష్టాత్మక విద్యాలయాల్లో ప్రవేశం పొందిన బీసీ విద్యార్థులకు సంపూ ర్ణంగా పీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని ఆయన ఆదేశించారు. వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్న దని ఆయన తెలిపారు. బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాల యాలైన ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్‌ వర్సీటీలు సహా 200 కు పైగా సంస్థల్లో ప్రవేశం పొందారనీ, అలాంటి వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్‌) చెల్లించేందుకు ప్రభుత్వం గతంలో ఎస్సీ, ఎస్ట్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదనీ, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బీసీిలకు అందజే యాలనే సీఎం ఆదేశం మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ నిర్ణ యంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10వేల మంది బీసీి విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందుకు అదనంగా ఏటా రూ. 150 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. ఇప్పటికే యూఎస్‌, యూకే, ఆస్ట్రే లియా తది తర దేశాల్లో చదువుకునే విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల తో పాటు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కూడా చెల్లిస్తున్నామని తెలిపారు.

Spread the love