Monday, August 31, 2026
E-PAPER
Homeక్రైమ్తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ కర్నూలు: తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారిని ఉరవకొండకు చెందిన సంధ్య (22), హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర (5), సతీశ్‌ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను (23)గా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం వచ్చారు. అనంతరం ఈత కోసం నదిలోకి దిగి.. లోతు అంచనా వేయలేక గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -