3 వేల మంది ఉద్యోగులపై ఫోర్డ్ వేటు!

నవతెలంగాణ – హైదరాబాద్
ఉద్యోగులపై వేటేస్తున్న సంస్థల్లో ఇప్పుడు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కూడా చేరింది. ఉద్యోగులకు లేఆఫ్ ఇస్తున్నట్టు తెలిపింది. అమెరికా, కెనడాలో పనిచేస్తున్న దాదాపు 3 వేల మందిని తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో 2 వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు కాగా, మిగతా వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. కంపెనీలోని అన్ని స్థాయుల ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, వీరిలో ఎక్కువమంది ఉన్నతస్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ వాహనాలకు అనుకున్నంతగా డిమాండ్ లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Spread the love