టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురి అరెస్ట్

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ సోమవారం మరో నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. తాజాగా మరో నలుగురిని అదుపులోకి తీసుకుంది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ రమేష్ తో పాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ లను అరెస్ట్ చేసింది. ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించిన 25 ప్రశ్నాపత్రాలను రమేష్ విక్రయించినట్లుగా దర్యాఫ్తులో తేలింది. అంతేకాదు, ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేష్ సమాధానాలు చేరవేసినట్లుగా వెల్లడైంది.

Spread the love