ఆద్యంతం వినోదభరితం

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ లాంటి పెద్ద సంస్థ రిలీజ్‌ చేయబోతోంది. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వం వహించారు.
బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించిన ఈ నెల 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. మ్యారేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కొత్త పాయింట్‌ను చూపెట్టడం ఆసక్తిని కలిగించింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడంతో సకుటుం బంగా ప్రేక్షకులు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్‌తో ఉన్నారు. సినిమా సక్సెస్‌ మీద చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం’ అని నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి చెప్పారు.

Spread the love