గం..గం..గణేశా

H..h..Ganeshaఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘గం..గం..గణేశా’. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదరుశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో ఆనంద్‌ దేవరకొండ తన సోషల్‌ మీడియా అక్కౌంట్స్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. ఈ చిత్ర పోస్టర్‌ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ రన్‌-ఫన్‌-గన్‌ అంటూ అగ్ర నాయిక సమంత చిత్ర బృందానికి బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.

Spread the love