అమర వీరుల స్థూపానికి పూలమాల

నూతన అక్బర్ పేట్ భూంపల్లి 
మండల కేంద్రంలోని అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా వారికి డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య, అక్బర్ పేట్ భూంపల్లి సర్పంచ్ స్వరూప బుచ్చయ్య, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు మంద చంద్ర సాగర్, బాల మల్లేశం గౌడ్, మిరుదొడ్డి  మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లింగాల వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు జీడిపల్లి రవీ, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ,  ప్రశాంత్ గౌడ్ , పాపని సురేష్ గౌడ్ , వివిధ మండలాల ప్రజాప్రతినిధులు గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దక్షిణ కాశీగా పేరుగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. తదనంతరం దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ చౌరస్తాలోని నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి … చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు మెదక్ ఎంపీ దుబ్బాక పట్టణం లోని మారెమ్మ, బాలాజీ ఆలయల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం దుబ్బాక బస్టాండ్ వద్ద నున్న బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించగా.. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దుబ్బాక మండలం బీఆర్ఎస్ నాయకులు గజమాలతో సత్కరించారు. వారు మాట్లాడుతూ, మీ బిడ్డను నేను, ఆశీర్వదించండి, దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, ఎంపిపి కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నమిలె భాస్కరాచారి, డిసిసిబి డైరెక్టర్ బక్కి వెంకటయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి, మనోహర్ రావు, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేపిఆర్ అభిమానులు, పలువురు పాల్గొన్నారు.
Spread the love