ఆర్కే-7 గనిని సందర్శించిన జీఎం

నవతెలంగాణ-నస్పూర్‌
శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-7 గనిని బుధవారం శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం సంజీవ రెడ్డి సందర్శించారు. అనంతరం జీఎం ఆర్కే-7 గ్రూప్‌ ఏజెంట్‌ మాలోతు రాముడు, గని మేనేజర్‌ సాయి ప్రసాద్‌తో కలిసి గనిలోకి దిగి 2 ఎన్‌ 15 డిస్టిక్‌లోని పని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. గనిలో చేపడుతున్న రక్షణ చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి, గనిలో చేపడుతున్న రక్షణ చర్యలపై ఆర్కే-7 గ్రూప్‌ ఏజెంట్‌, గని మేనేజర్‌ను అభినందించారు. జీఎం అధికారులను, ఉద్యోగులను ఉద్దేశించి పలు సూచనలు చేస్తూ, ప్రతి ఒకరు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అన్నారు. ఉద్యోగులు గాయాల బారిన పడకుండా రక్షణ సూత్రాలను పాటించాలని, పని స్థలాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే ఉన్నత అధికారులకు తెలియపరుస్తూ అక్కడ రక్షణ చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రమాద రహిత గనిగా సింగరేణిలో గుర్తింపు తెచ్చే లక్ష్యంగా పని చేయాలని జీఎం సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవిశంకర్‌, గ్రూప్‌ ఇంజనీర్‌ రాజా రవి చరణ్‌, అండర్‌ మేనేజర్‌ వెంకట్‌ రామ్‌, ఇంజనీర్‌ సుధీర్‌రెడ్డి ఉన్నారు.

Spread the love