రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

గాయపడిన వారంతా పేద కుటుంబాలే
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌
భృంగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను
సీపీఐ(ఎం) నాయకుల పరామర్శ
నవతెలంగాణ-యాచారం
కొత్తపల్లిలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి గాయపడిన 22 మంది కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ కోరారు. యాచారం మండలం పరిధిలోని కొత్త పల్లి గ్రామానికి చెందిన కొంతమంది కార్మికులు ఆదిభట్ల దగ్గరలో ఉపాధికి వెళ్లి, పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆదిభట్ల సమీపంలో ఆటోబోల్తాపడి 22 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు హైదరాబాదులో భృంగి ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. గురువారం సీపీఐ(ఎం) నాయకులు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా కార్మికులంతా తీవ్రస్థాయిలో గాయ పడటం బాధాకరమైన విషయమన్నారు. గాయపడిన వారంతా పేద కుటుంబాలేనని గుర్తు చేశారు. ఈ గాయ పడ్డ వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంద ా్నరు. స్థానిక ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి వెంటనే స్పందించి, గాయపడిన కుటుంబాలకు అండగా నిలబడి, ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కార్మికులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, జగదీష్‌, జిల్లా కమిటీ సభ్యులు కిషన్‌, ఆ పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, కొత్తపల్లి సర్పంచ్‌ ఎండీ హబీబుద్దిన్‌, ఉపసర్పంచ్‌ కావాలి జగన్‌, పెద్దాపురం నరసింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love