ప్రభుత్వ యునాని వైద్య కళాశాల గ్రంథాలయం

అసలు యునాని వైద్యం అనగా ఎక్కువ మందులు వాడకుండా శరీర ధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చేసేటువంటి వైద్యమే యునాని వైద్యం. ఒకనాడు ఈజిప్ట్‌ సిరియా ఇరాన్‌ ఇరాక్‌ చైనా భారత్‌ వంటి దేశాల్లో అద్భుతంగా వెలిగింది ఈ వైద్యం. అరబ్బులు ఈ వైద్య విధానాన్ని బాగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఖిల్జీలు, మొగలులు, అసఫ్‌ జహిలు ఈ వైద్య విధానానికి బాగా ప్రాచుర్యం కల్పించారు.
గ్రీకు దేశపు వైద్య విధానం గా గుర్తింపు పొందిన యునాని వైద్యం. గ్రీకు భాషలో అయోనియా అనే పదం నుండి యునాని అనే పదం వచ్చింది. రెండవ శతాబ్దంలో యునాని వైద్యం ఆవిర్భవించగా తొమ్మిదవ శతాబ్దంలో హకీమ్‌ బీన్‌ సిన్‌హా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అసలు యునాని వైద్యం అనగా ఎక్కువ మందులు వాడకుండా శరీర ధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని చేసేటువంటి వైద్యమే యునాని వైద్యం. ఒకనాడు ఈజిప్ట్‌ సిరియా ఇరాన్‌ ఇరాక్‌ చైనా భారత్‌ వంటి దేశాల్లో అద్భుతంగా వెలిగింది ఈ వైద్యం. అరబ్బులు ఈ వైద్య విధానాన్ని బాగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఖిల్జీలు, మొగలులు, అసఫ్‌ జహిలు ఈ వైద్య విధానానికి బాగా ప్రాచుర్యం కల్పించారు. శరీరంలో రక్తం, బలగం, సఫ్రా, సౌదా అని నాలుగు విభాగాలు సరిగా పనిచేయనట్లయితే శరీరం రోగ గ్రస్తమవుతుందని అర్థం. నాడిని ఆధారంగా చేసుకుని యునాని వైద్యం చేస్తారు. నాలుగు రకాల పద్ధతుల్లో వైద్యాన్ని అందిస్తారు. వాటిలో ఇలాచ్‌ ఫిద్‌ తద్‌ బీర్‌(మందు ఇవ్వకుండా వైద్యం చేయడం), ఇలాచ్‌ బిల్‌ కిజా(తినే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా వైద్యం చేయడం), వనమూలికలు జంతువుల నుండి తీసిన పదార్థాలు ఖనిజాల నుండి తయారుచేసినటువంటి మందుల ద్వారా వైద్యం చేయడం, చివరగా శస్త్ర చికిత్స ద్వారా వైద్యం చేయడం. ఇకపోతే అసఫ్జాహీలు 1898లోని ఆయుర్వేద యునాని వైద్యశాలను నిర్మించారు. 1928వ సంవత్సరంలో ఏడవ నిజం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ నిజామియా యునాని వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. నిజామియా తిబ్బి (యునాని) కళాశాల 1938 వ సంవత్సరంలో పూర్తి అయింది. దాదాపు 5 లక్షల రూపాయలతో మూడు అంతస్తుల భవనాన్ని దేదీప్యమానంగా ఇండో ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ పద్ధతులలో భవనాన్ని నిర్మించారు. మూడు అంతస్తులతో 180 పడకలతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. చారిత్రాక కట్టడమైన చార్మినార్‌ పక్కనున్న మక్కా మసీదుకు ఎదురుగా వున్న ఈ ఆసుపత్రిని హైదరాబాద్‌ ప్రాంత ప్రజలకే కాక వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ప్రజలకు యునాని వైద్యం ద్వారా సేవలందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ వైద్యశాలలోకి ప్రవేశించగానే ఇరువైపులా భోజనపు పలుబాట్లు, శరీర ధర్మశాస్త్రాల సూచనలు.. మనకు దర్శనం ఇస్తాయి. ఈ భవనంలో 70 ఏళ్ల కింద పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన విశాలమైన లిఫ్ట్‌, చక్కటి వెలుతురుతో కూడిన విశాలమైన ఆపరేషన్‌ థియేటర్‌ వున్నాయి. 1939 నాడే ఈ ఆపరేషన్‌ థియేటర్‌కి సంబంధించిన వైద్య పరికరాలను విదేశాల నుంచి తెప్పించారు. నిజామియా జనరల్‌ హాస్పిటల్‌ అనుబంధంగా ఈ కళాశాలను మరియు రీసెర్చ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేశారు. యునాని వైద్యంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు (మహర్‌ తిబ్‌) 1942 నుండి అందిస్తున్నారు. ఈ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులల్లో ఎం.డీ మూడు సంవత్సరాలు. 1973లో డాక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ మెడిసిన్‌ (మౌలా జాత్‌), తరువాత గైనకాలజీ అండ్‌ అబస్ట్రిక్‌ (అమ్రాజ్‌ ఈ నిస్వాన్‌ ఓ కాబాలత్‌) 1983 లో, ఫండమెంటల్‌ (కుల్యాత్‌), సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ కోర్సులు యునాని విభాగంలో అందిస్తున్నారు. వీటితోపాటు నర్సింగ్‌, జర్‌హా కోర్సులు కూడా అందిస్తున్నారు. ఈ కోర్సులు ఆయుష్‌ (A్‌ఖూన) విభాగం ద్వారా గుర్తింపు పొందినది. గ్రంథాలయం: ఈ గ్రంథాలయంలో 16,700 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో ఫండమెంటల్‌, ఫార్మా కాలేజి, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, టాక్సీకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, సోషల్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఫారెన్సీక్‌ మెడిసిన్‌, ఆప్తమాలజీ ఇ.ఎన్‌.టి, డెర్మటాలజీ, న్యూరాలజీ, వివిధ విభాగాల పుస్తకాలూ అందుబాటులో ఉన్నాయి. పార్శి, ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌ భాషలలో అందుబాటులో ఉన్నాయి. సంస్కృత శ్లోకాలు కూడా అరబిక్‌, పారశీక భాషలో వున్నాయి. ఈ గ్రంథాలయంలో యునాని, ఆయుర్వేద, ఆలోపతి వైద్య విధానానికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన పుస్తకాలు, మెడికల్‌ చట్టాలు ఫార్మ కాలేజీ, రోగ నిర్ధారణకు సంబంధించిన, శరీర ధర్మానికి సంబంధించిన మెడికల్‌ చట్టాలు, మెడికల్‌ ఎథిక్స్‌, రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఆఫ్‌ వేరియస్‌ మెడికల్‌ సిస్టమ్స్‌ వంటి అపురూపమైన పుస్తకాలు అరబిక్‌ పారశీక భాషలో ఉన్నాయి. చక్కటి డిక్షనరీలు, ఎన్సైక్లోపీడియాలు, ఇయర్‌ బుక్స్‌, వివిధ దేశాల మెడికల్‌ చట్టాలు, వివిధ వైద్య పద్ధతుల చరిత్రలు ఇక్కడ చదవొచ్చు. 1898 కాలం నాటి ఫరంగ్‌ అసఫియా, 1890 నాటి ఫరంగ ఇస్తెలా, హకీమ్‌ మహమ్మద్‌ కబిరొద్దిన్‌ తర్జుమా చేసిన అనేక ఉర్దూ, పారశీక, అరబిక్‌ పుస్తకాలు 1937 కాలం నాటి పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. యునాని మెడికల్‌ పేటెంట్స్‌ పుస్తకాలూ, 1890 మెడిసిన్‌ ఆఫ్‌ లా, 1910, 1915, 1920, ఫార్మా కాలేజీ బుక్స్‌, 1890 కాలం నాటి రిసాల్‌ హైరుల్‌ కలాం, 1876 నాటి ఇల్‌ ముల్‌ అమ్రోజ్‌(సైన్స్‌ ఆఫ్‌ డిసీజెస్‌), 1889 నాటి రహింఖాన్‌ కరాబదినే, 1930 నాటి ఫార్మకాలజీ ఫార్మకోతెఫియా, 1890 మోహితే ఆజాం వ్రాసిన ఫండమెంటల్స్‌ ఆఫ్‌ యూనాని, 1890 నాటి ఎనిమల్‌ హజెబెండ రీ, 1835 నవాబ్‌ మీర్‌ హసంఖాన్‌ వ్రాసిన మూలాస్‌ తుల్‌ హికి మెన్‌ తసానిఫా షాహకార్‌, 1880 షరతాహా జిబ్‌ తోఫా, 1880 హకీం ఫరూద్‌ రాసిన జనరల్‌ మెడిసిన్‌, 1903 ఇలాజే ఇమ్రాస్‌ (ప్రివెంటివ్‌ మెడిసి న్‌), 1838 నాటి హిస్టరీ ఆఫ్‌ యునాని మెడిసిన్‌, హిస్టరీ ఆఫ్‌ అలోపతి మెడిసిన్‌, 1922 గ్యాస్తాన్‌ రాసిన మెడికల్‌ ఫార్ములాస్‌, 1923 వే ఆఫ్‌ యూనాని ట్రీట్మెంట్‌, 1896లో కుతుబుద్దీన్‌ హైమద్‌ రాసిన ఖానున్‌ చా, 1827 కుతుబుద్దీన్‌ హైమధ్‌ రాసిన రూల్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌, జెరియాట్రిక్‌ మెడిసిన్‌, ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ హిరోయిన్‌ మెడిసిన్‌, 19వ శతాబ్దం చివరిభాగంలో క్లినికల్‌ బ్యాక్టీరియాలోజి సైన్స్‌ ఆఫ్‌ డిసీజెస్‌ ప్రాక్టీస్‌ మెడిసిన్‌, స్టడీస్‌ ఇన్‌ క్లినికల్‌ మెడిసిన్‌, అదేవిధంగా 20 శతాబ్దం నాటి మొదటి అంకంలో ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ నాని మెడిసిన్‌, రూల్స్‌ ఆఫ్‌ ది నాని మెడిసిన్‌, ఫండమెంటల్‌ అఫ్‌ యునాని మెడిసిన్‌ లాంటి అపురూపమైన పుస్తకాలు ఈ గ్రంథాలలో కొలువు తీరాయి. అపురూపమైన పుస్తకాలు/ రేర్‌ కలెక్షన్‌: 550 పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ థీసిస్‌ లు, 489 మాన్స్కప్ట్‌ లు (అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, డెర్మటాలజీ, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌), 6750 రేర్‌ కలెక్షన్‌ పుస్తకాలను ఇక్కడ చూడొచ్చు. యునాని వైద్య పుస్తకాలే కాకుండా జనరల్‌ పుస్తకాలు, సాహిత్యం, లిటరేచర్‌, చరిత్ర, సోషియాలజీ, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా ఆఫ్‌ అమెరికా, ఎన్సైక్లోపీడియ అఫ్‌ మెడికల్‌ సైన్స్‌, అలోపతి విభాగంలో జనరల్‌ మెడిసిన్‌ జనరల్‌ సర్జరీ, ఫార్మా కాలేజ్‌, పాథాలజి, గైనకాలజీ, డెర్మాటాలజి విభాగంలోని పుస్తకాలు ఆంగ్ల భాషలో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో చక్కటి రీడింగ్‌ హాల్‌ వుంది. ఈ రీడింగ్‌ వాళ్లు ఒకేసారి 50 మంది కూర్చొని చదువుకునే సదుపాయం కలదు. పారశీక లిటరేచర్‌, పారశీక సాహిత్యం, అరబిక్‌ లిటరేచర్‌, గ్రామర్‌, అరబిక్‌ లాంగ్వేజ్‌, హిస్టరీ, సైకాలజీ, ఫిలాసఫీ అరబిక్‌ భాషలో వున్నాయి. జర్నల్స్‌ : ఇస్లామిక్‌ కల్చర్‌ క్వార్టర్లీ, ఇండియన్‌ మెడిసిన్‌ గెజిట్‌, గ్యాంగ్‌ రి లాంగ్‌ త్సో, అనస్థీషియా, మాస్టర్‌ ఆఫ్‌ యునాని, కాలేజ్‌ మ్యాగజైన్‌, జామియా మిలా ఇస్లాం, జామియా మిలా హందరత్‌, అలీగడ్‌ ముస్లిం యూనివర్సిటి పత్రికలతో బాటు పది రకాల మెడికల్‌ సైన్స్‌ మ్యాగజైన్స్‌ అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ గ్రంథాలయానికి 100 మంది చదువరులు విచ్చేస్తుంటారు. అలీగడ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి, పారశీక దేశాల నుండి అరేబియన్‌ దేశాల నుండి ఈ గ్రంథాలయానికి విచ్చేసి ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపద వారి పరిశోధనలో ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో ఉన్న అపురూపమైన గ్రంథ సంపదను రేహక్తా ఫౌండేషన్‌ వారి సహాయ సహకారాలతో డిజిటలైజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చారిత్రాత్మక గ్రంథాలయ సంపదను అందరూ ఉపయోగించుకునే విధంగా డిజిటలైజ్‌ చేసిన తర్వాత పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచే ప్రయత్నం చేయాలి.
– డా|| రవికుమార్‌ చేగొని,
9866928327

Spread the love