విశ్వ నట చక్రవర్తి యస్వీ రంగారావు.

తెలుగు వెండితెర పై వెలిగిన విశ్వ నట చక్రవర్తి యస్వీ రంగారావు. తన నట విశ్వరూపంతో కథానాయకుల కన్నా కూడా, ఎక్కువ పేరు సంపాదించిన మహానటుడు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది. ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం.., నటనలో నిగ్రహం.., పాత్రకు తగిన ఆగ్రహం.., అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి. అందుకే ఆయన వెండితెర మీద కనపడగానే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు. ఒక్కసారి కళ్లు చిట్లించి, పెదవి విరిచి, తల కొద్దిగా ఆడిస్తే.. ప్రేక్షకులకు మైమరచిపోయేవారు. ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్యకశిపుడు.. ఇంటి పెద్దన్నయ్య, మతిమరపు తండ్రి.. లాంటి అనేక అపురూపమైన పాత్రల్లో అనితరసాధ్యంగా తన అభినయంతో అలరించాడు రంగారావు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచేపోయే ‘మాయా బజార్‌, పండంటి కాపురం, బాంధవ్యాలు, నర్తనశాల, సంపూర్ణ రామాయణం, భక్త ప్రహ్లాద’ లాంటి ఎన్నో సినిమాల్లో నటనే శ్వాసగా జీవించిన, ఎస్‌. వి. రంగారావు మాట పెదవి దాటకుండానే భావం ముఖంలో కనపడుతుంది.. స్వరంలో గాంభీర్యం మాటల్లో స్పస్టత ‘బానిసలకు ఇంత అహంభావమా’, ‘ఎవరూ సష్టించనిదే మాటలు ఎలా పుడతాయి’, ‘సాహసం సాయరా రాజకుమారి దొరుకుతుంది’, ‘జై పాతాళభైరవీ’ లాంటి డైలాగులు ప్రేక్షకుల మదిలో ముద్ర వేశాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చిన ఆ మహ నటుడి పుట్టినరోజు జూన్‌ 3 వ తేది సందర్భంగా నవతెలంగాణ పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
1946లో విడుదలైన ‘వరూధిని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన రంగారావు ఈ చిత్రం తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ పాత్రలు ఎన్నో చేశాడు. వాటిలో ముఖ్యంగా కీచకుడు, రావణుడు, నరకాసురుడు, దుర్యోధనుడు, మాంత్రికుడు మరియు ఘటోత్కచుడు లాంటి ఎన్నో రకాల పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నాడు. తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా విలన్‌ అంటే ఇలానే ఉండాలేమో అనుకునే విధంగా విలన్‌ పాత్రలను చేశాడు. దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించిన రంగారావు నటనను మెచ్చి ‘విశ్వ నట చక్రవర్తి’, ‘నట సార్వభౌమ’, ‘నట శేఖర’ అనే బిరుదులు ఆయన్ని వరించాయి. రంగారావు ‘నర్తనశాల’ సినిమాలో చేసిన కీచకుడి పాత్రకు జకార్తా ఫిల్మ్‌ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు, ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్రలో నిలిచి పోయాడు.

నవతరం ప్రేక్షకులను సైతం ఇప్పటకీ యస్వీఆర్‌ పాత్రలు ఆకర్షిస్తూనే ఉండడం విశేషం! ముఖ్యంగా ‘పాతాళభైరవి, పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్‌, గుండమ్మకథ, నర్తనశాల, నాదీ ఆడజన్మే, ఆత్మబంధువు, బాలభారతం, యశోదకష్ణ, దేవుడు చేసిన మనుషులు’ వంటి చిత్రాల్లోని ఆయన నటన ఇప్పటికీ తెలుగువారిని కట్టి పడేస్తోంది.
రంగారావు నటయాత్ర తెలుగు, తమిళరంగాలలో కొనసాగింది. వీరు నటించిన నర్తనశాల లోని కీచకుని వేషానికి పలువురి ప్రశంసలు లభించింది. సతీ సావిత్రి అనే సినిమా తీసేటప్పుడు, చైనా ప్రధాని చౌ యెన్‌ లై, వీరిని సెట్లో యముని వేషంలో చూసి ఆశ్చర్యచకితులయ్యారట! జకార్తాలో జరిగిన ఇండోనేసియా ఫిలిం ఫెస్టివల్‌ లో, వీరి కీచకుని వేషానికి ఉత్తమ నటుని అవార్డుతో పాటుగా బంగారు పతకం కూడా దక్కింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన ఒక ప్రత్యేక బాణీని ప్రవేశపెట్టారు. రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, మాయల పకీరు వేషాలు రంగరావుని తెలుగు ప్రేక్షకుల గుండెలపై చిరస్థాయిగా కూర్చో పెట్టాయి. సంభాషణల ఉచ్చారణ, పలికే విధానం, మాటల విరుపు, హావభావాలు మరెవరి తరంకావు. ఎంత మహా నటుడినైనా డామినేట్‌ చేయ గల సత్తా సామర్ధ్యం ఈయన సొంతం. రంగారావుతో నటించాలంటే ఆనాటి అగ్రనటులు సైతం భయపడేవారు, ఒక్క సావిత్రి తప్ప!

సామర్ల వెంకట రంగారావు (ఎస్‌. వి. రంగారావు) కష్ణాజిల్లా నూజివీడులో 1918 జూలై 3న జన్మించాడు. రంగారావు తండ్రి కోటీశ్వరనాయుడు. ఎక్సైజు శాఖలో పనిచేస్తూ పలు ఊళ్ళు మారుతూ ఉండడం వల్ల రంగారావు నాయనమ్మ పిల్లలను తీసుకొని మద్రాసు మకాం మార్చింది. ఎస్వీఆర్‌ చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూల్‌ లో చదివే రోజుల్లో పదిహేనవ ఏట తొలిసారి నాటకంలో నటించాడు రంగారావు. తరువాత స్కూల్‌ లో ఏ నాటకం జరిగినా అందులో రంగారావు నటిస్తూ ఉండేవాడు. నాటి మేటి రంగస్థల నటులు ‘బళ్ళారి రాఘవ, గోవిందరాజుల సుబ్బారావు’ నటించిన నాటకాలు చూసి, వారిలాగే తానూ ఏ రోజుకైనా నటుడు కావాలని తపించాడు రంగారావు. మద్రాసులో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకా చదివిన రంగారావు, తరువాత విశాఖపట్నంలోని మిసెస్‌ ఎ.వి.ఎన్‌. కళాశాలలో ఇంటర్మీడియట్‌, కాకినాడలోని పి.ఆర్‌. కళాశాలలో బియస్సీ పూర్తి చేశాడు. కాకినాడలోని ‘యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌’లో చేరి పలు నాటకాల్లో నటించాడు. అక్కడే అంజలీదేవి, ఆదినారాయణరావు, బి.ఏ.సుబ్బారావు, రేలంగి వంటి సినీనటులతో రంగారావుకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు బందరు, విజయనగరంలో ఫైర్‌ ఆఫీసర్‌ గా పనిచేసిన, ఆయన మనసు మాత్రం నటనవైపు మళ్ళుతూ ఉండేది. దర్శకుడు బి.వి. రామానందం, యస్వీఆర్‌ కు దూరపు బంధువు. ఆయన తెరకెక్కించిన ‘వరూధిని’ చిత్రంలో ప్రవరాఖ్యుని పాత్రలో తొలిసారి తెరపై కనిపించాడు.
‘వరూధిని’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం
1946లో ‘వరూధిని’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రంగారావు ‘వరూధిని’ చిత్రంలో నటి గిరిజ తల్లి దాసరి తిలకం సరసన నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలు కావడంతో యస్వీఆర్‌ కు ఆట్టే అవకాశాలు రాలేదు. ఆ సమయంలో జెమ్‌షెడ్‌పూర్‌ లోని టాటా కంపెనీలోనూ కొంతకాలం ఉద్యోగం చేశాడు రంగారావు. తరువాత బి.ఏ.సుబ్బారావుతో ఉన్న పరిచయం కారణంగా ఆయన తెరకెక్కించిన ‘పల్లెటూరి పిల్ల’లో ఓ చిన్న పాత్రలో నటించాడు. అదే సమయంలో యల్వీ ప్రసాద్‌ తెరకెక్కిస్తోన్న ‘మనదేశం’లోనూ ఓ చిన్న పాత్రలో కనిపించాడు రంగారావు. విజయావారి తొలి చిత్రం ‘షావుకారు’లో సున్నపు రంగడు పాత్రతోనే రంగారావుకు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత అదే విజయావారి ‘పాతాళబైరవి’లో నేపాల మాంత్రికునిగా నటించి, ‘సాహసం సాయరా రాజకుమారి దొరుకుతుంది’ ‘జై పాతాళభైరవీ’ లాంటి డైలాగులతో జనం మదిని దోచాడు రంగారావు. ‘పాతాళభైరవి’ ఘనవిజయంతో రంగారావు మరి వెనుదిరిగి చూసుకోలేదు. తనకు లభించిన పాత్రల్లో రంగారావు ఇట్టే ఒదిగిపోయేవాడు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో రంగారావు అనేక మరపురాని పాత్రలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. యన్టీఆర్‌, ఏయన్నార్‌ నటించిన అనేక చిత్రాలలో కేరెక్టర్‌ రోల్స్‌ లో యస్వీఆర్‌ అలరించిన తీరు మరపురానిది.
నవరస నటుడు
‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ అంటూహొమాయాబజార్‌హొలో,హొభక్త ప్రహ్లాదహొలో హిరణ్యకశిపుడుగా ఆయన చూపిన పద్య వాచక పటిమ, కీచకుడిగా, దుర్యోధనుడిగా, రావణ బ్రహ్మ గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పౌరాణిక ప్రతినాయక పాత్రలు… అన్నింటా ఆయన నటన అనన్య సామాన్యం., ‘నటనకే నటనను నేర్పిన నటుడాయన. ఆయన నటనలోని ప్రతీ అంశమూ ఓ వైవిధ్యమే. తనదైన శైలిలో ఆయన చేసే సంభాషణల ఉచ్చారణ, ఆ విరుపు, హావ భావాలు ఆయనకు మాత్రమే సొంతం. పెళ్లి చేసి చూడుహొచిత్రంలో ఆయన పోషించిన ‘వియ్యన్న’ పాత్ర కూడాహొ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అలాగే,హొదీపావళి,హొఅనార్కలి,హొమహాక వికాళిదాసు,హొభట్టి విక్రమార్క,హొబొబ్బిలియుద్ధం,హొచరణసి, లక్ష్మీ నివాసం,హొజయభేరిహొఇలా ఒక పాత్రకు మరో పాత్రకూ సంబంధం లేకుండా జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన అభినయంలో ప్రదర్శిస్తూ, తన గొంతులో ధ్వనింపచేసిన నటవిరాట్టు రంగారావు. నాదీ ఆడజన్మే,హొసుఖదు:ఖాలుహొవంటి గొప్ప చిత్రాలను నిర్మించి సామాజిక చిత్రాలపై తనదైన సరళిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దర్శకత్వం మీది ఆసక్తితోహొచదరంగం,హొబాంధవ్యాలుహొచిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. బతుకుతెరువు, బంగారుపాప,హొబందిపోటుదొంగలు,హొతాతామనవడు,హొరాజు – పేద,హొగుండమ్మకథ… ఇలా అనేక ఆణిముత్యాలైన చిత్రాలు ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి.హొచార్లీ చాప్లిన్‌ వంటి మహా నటుని ప్రశంసలు అందుకున్న గొప్ప నటుడాయన. నర్తనశాలలో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం.హొచదరంగంలో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి పాత్ర,హొతోడికోడళ్లులో మతిమరుపు లాయరు కుటుంబరావు పాత్ర,హొకత్తుల రత్తయ్యలో రౌడీపాత్ర,హొఅనార్కలిలో అక్బర్‌ పాత్ర,హొపాండవ వనవాసంలోహొదుర్యోధనుడి పాత్ర… ఒకటేమిటి తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయే పాత్రలెన్నో ఆయనహొచేశాడు. అలాగే,హొభక్తప్రహ్లాద,హొచెంచులక్ష్మి,హొదీపావళి.. ఇలా ఒకటేమిటి ఆయన నటించిన ప్రతీ చిత్రమూ ఒక మహాద్భుత రససాగరమే. అలాగే, గుండమ్మకథ, దేవుడు చేసిన మనుషులు, దసరాబుల్లోడుహొచిత్రాల్లో ఆయన నటన అనితరసాధ్యం.
దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా రంగారావు నటించాడు.హొ రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. 1964లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ‘ఆఫ్రో-ఏసియన్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో ‘నర్తనశాల’లోని కీచక పాత్ర ద్వారా ఆయనకు ఉత్తమ నటునిగా అవార్డు లభించింది. ‘నటసమ్రాట్‌, నటసార్వభౌమ, నటశేఖర, విశ్వనటచక్రవర్తి’ వంటి బిరుదులతో యస్వీఆర్‌ ను జనం గౌరవించారు. చివరి దాకా తనదైన బాణీ పలికిస్తూ నటించిన యస్వీఆర్‌ 1974 జూలై 18న తుది శ్వాస విడిచాడు.
దర్శకుడు, నిర్మాతగా..
పౌరాణికాల్లో, సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న రంగారావు నటుడుగానే కాకుండా నిర్మాతగా మారి ‘నాదీ ఆడజన్మే!, చదరంగం, బాంధవ్యాలు, సుఖదు:ఖాలు’ లాంటి చక్కనిహొవిజయవంతమైన సినిమాలను నిర్మించాడు. ‘చదరంగం, బాంధవ్యాలు’ సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.హొ
రచయితగా..
ఎస్‌.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించాడు. ఆయన కథలు ‘ఆంధ్రపత్రిక, యువ, మనభూమి’ వంటి పత్రికలలో 1960-64 మధ్య కాలంలో ప్రచురింపబడ్డాయి. ఆయన వ్రాసిన ‘వేట’ ఆగష్టు 8, ‘పసుపు కుంకుమ’, ‘ప్రాయశ్చిత్తం’, ‘విడుదల’, ‘సంక్రాంతికి’, ‘సులోచన’ అనే ఏడు కథలు మాత్రం ఇప్పటికీ లభ్యమౌతున్నాయి. ఇటీవల ఈ కథలతో ఎస్‌.వి.రంగారావు కథలు అనే పుస్తకం సైతం వెలువడింది.
అవార్డులు
రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రంహొ’చదరంగం’హొచిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగాహొనంది అవార్డు, రెండవ చిత్రంహొ’బాంధవ్యాలు’ తొలి ఉత్తమ చిత్రంగాహొబంగారు నంది అవార్డునుహొగెలుచుకున్నాయి. ‘నర్తనశాల’హొచిత్రంలో ఎస్వీఆర్‌ నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ వారు, ఆంధ్రా ఫిల్మ్‌ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్‌ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాలు ఆయనను ఘనంగా సన్మానించాయి. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా భారత ప్రభుత్వం ఎస్వీ రంగారావు పేరున పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఎస్వీఆర్‌ ‘విశ్వనటచక్రవర్తి’, ‘నటసార్వభౌమ’, ‘నటసింహ’, ‘నటశేఖర’ బిరుదులను పొందాడు
. – పొన్నం రవిచంద్ర, 9440077499

Spread the love